Prabhas : బాలయ్య సినిమాలు మాత్రమే కాదు ఎవరి మనసులో ఏముందా అని చిటికెలో చెప్పెస్తారు..అందుకే ఆయనకు బాగా క్రేజ్ పెరిగింది.. ఇంతకీ ఏం చెప్తున్నారో అర్థం అయింది కదా.. అదేనండి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి.. ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ షో అంటే ఇప్పుడు అందరి నోట ప్రభాస్ మాట వినిపిస్తోంది.. రీసెంట్గా సీజన్ 2 లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు.. పాన్ ఇండియా స్టార్ కావడం తో అందరి చూపు ఈ షో పైనే వుంది.. అసలు ప్రభాస్ ఏం చెబుతారో, అంత పెద్ద స్టార్ ఎలా ఉంటాడో అని డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రజలు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.. వారిని మరింత ఊరించడానికి ఆహా టీమ్ ఒక్కోసారి ఒక్కో వీడియోను విడుదల చేస్తూ మరింత బజ్ ను క్రియేట్ చేస్తున్నారు..
ఈ షో మొత్తానికి ప్రభాస్ వెళ్ళేప్పుడు అనేది హైలెట్ అయ్యింది..43 ఏళ్ల ప్రభాస్ పెళ్లి భాజాలు ఎప్పుడూ మొగుతాయి..ఇలాంటి ప్రశ్నలు షోను మరింత రసవత్తరంగా మార్చింది.. ఇక బాలయ్య కూడా ప్రభాస్ నుంచి ఆన్సర్ రాబట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు..ఏజ్ బార్ అవుతున్నా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? అని అడగ్గా.. నాకు రాసి పెట్టి లేదు సర్, అని ప్రభాస్ సమాధానం చెప్పాడు. మీ అమ్మకు చెప్పిన సమాధానాలు చెప్పొద్దు, అన్నారు బాలయ్య. దానికి ప్రభాస్ గట్టిగా నవ్వేశారు.మొన్నామధ్య శర్వానంద్ గెస్ట్ గా వచ్చాడు. ఎప్పుడు పెళ్లంటే… ప్రభాస్ తర్వాత అన్నాడని బాలకృష్ణ ప్రభాస్ తో చెప్పారు.
అయితే నేను సల్మాన్ ఖాన్ తర్వాత అని చెప్పాలేమో, అని ప్రభాస్ టైమింగ్ కౌంటర్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫ్రెండ్ రామ్ చరణ్ కాల్ మాత్రం ప్రభాస్ ని కంగారు పెట్టింది. ఎక్కడ తన సీక్రెట్స్ లీక్ చేస్తాడేమో అని ప్రభాస్ భయపడ్డారు.చరణ్ కి కాల్ చేసిన బాలయ్య… ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ చెప్పాలి, అని అడిగాడు. చరణ్… ఏం చెప్పమంటావు డార్లింగ్ అని ప్రభాస్ నే తిరిగి అడిగాడు. నీకు తెలుసుగా ఏదో ఒకటి చెప్పేయ్ పేర్లేదు, అని ప్రభాస్ అన్నాడు. ఒకటి మాత్రం చెప్పగలను సర్… ప్రభాస్ త్వరలో ఒక గుడ్ న్యూస్ తనే స్వయంగా చెప్పబోతున్నాడు, అని చెప్పాడు.
బాలయ్య గారికి ఏం దాచకుండా చెప్పేయ్… నువ్వు ఆయన షోకి వచ్చావంటే అన్నీ చెప్పడానికే వచ్చావు అనుకుంటా, అని చరణ్ అన్నారు. చరణ్ ని బాలకృష్ణ మరో క్లారిటీ అడిగారు. ప్రభాస్ ప్రేమిస్తున్న ఆ అమ్మాయి రెడ్డి, రాజు, చౌదరి, నాయుడు లేదా శెట్టి, సనన్ నా? నాకు జస్ట్ హింట్ ఇవ్వు అన్నాడు.ఇక చరణ్… ఒకటి మాత్రం చెప్పగలను సర్… చరణ్ త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు, అన్నాడు…ఇక ఇప్పుడేమో కృతి సనన్ తో మాల్దీవుల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. ఎప్పుడూ పీటలు ఎక్కుతారో చూడాలి..ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజిగా వున్నారు..