Balakrishna : బాలయ్యతో పవన్ కళ్యాణ్ పిక్ వైరల్..అక్కడ రచ్చ చేయనున్న స్టార్స్..ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్..Balakrishna : బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే..ఒకప్పుడు సినిమాలు మాత్రమే చేస్తూ జనాల హృదయాల్లో నిలిచిన ఆయన ఇప్పుడు సినీ ప్రేక్షకులను మరింత ఎంటర్‌టై న్ చేస్తున్నారు.ఆఁహాఁ హా అన్‌స్టాపబుల్ షో ద్వారా తనలోని చిలిపి తనాన్ని బయట పెట్టి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.. ఆ షో లో సెలెబ్రేటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో తెలియని విషయాలను తెలియజేశారు. ఈ షో మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తీ చేశారు బాలయ్య.ప్రస్తుతం ఆయన అన్‌స్టాపబుల్ సీజన్ 2 చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు..

Balakrishna
Balakrishna

ఇది ఇలా వుండగా ..ఇప్పుడు మాంచి కిక్ ఇచ్చే వార్తను జనాలకు చెప్పారు ఆహా టీమ్..అన్‌స్టాపబుల్ సీజన్ 2కు పవన్ కల్యాణ్ రాబోతున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది. దీంతో అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..ఈ వార్త విన్నప్పటి నుంచి వారి సంతోషానికి అవధులు లేవు..ఈ ఇద్దరు మాస్ హీరోలు ఏం మాట్లాడుకుంటారు.. బాలయ్య పవన్‌ను ఆటపట్టిస్తారా.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ నెల ఎండింగ్‌లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. వేయి కళ్లతో ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అయితే తాజాగా అందుకు శాంపిల్ అన్నట్లు ఓ పిక్ తెగ వైరల్ అవుతుంది. వీరసింహారెడ్డి సెట్స్‌లో బాలయ్యను కలిశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలయ్య, పవన్ పక్కపక్కన నిల్చుని.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. దర్శకుడు క్రిష్, హీరోయిన్ శృతి హాసన్, మైత్రి ప్రొడ్యూసర్ రవి, మరో ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం కూడా ఈ ఫోటోలో ఉన్నారు.

ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే..గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న వీరసింహా రెడ్డి మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు సఇనిమాల్లోనే శృతి హాసనే హీరోయిన్. రెండు చిత్రాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు..ఈ సినిమాకు ఇప్పటివరకు భారీ రెస్పాన్స్ వచ్చింది..ఇక ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్నాడు. పిరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న పవన్.. ఆ తర్వాత వీరసింహా రెడ్డి సెట్స్‌లోకి వెళ్లి బాలయ్యను కలిశారు.అలాగే వీరు రాజకియాల్లో కూడా రానిస్తున్నారు..ఇక్కడ వచ్చే ఎన్నికల చర్చలు జరగనున్నాయని తెలుస్తుంది..ఏది ఏమైనా ఇద్దరు హీరోలను ఒకే ఫ్రెమ్ లో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు..