Tollywood Actress : అయ్యో పాపం.. టాలివుడ్ లో ఆ హీరోయిన్లు అందుకు పనికిరారా?

- Advertisement -

Tollywood Actress : కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ ఎన్నో నష్టాలను చూసింది.. ఈ ఏడాది ఇండస్ట్రీలో విడుదల అయిన సినిమాలు బాక్సాఫిస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. రెండేళ్ల పాటు ఇండస్ట్రీ మూగ బొయింది.. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో సందడి మొదలైంది..వరుస సినిమాలు షూటింగ్ లు, రిలీజ్ లు జరిగాయి..2022లో విడుదలైన సినిమాల్లో ఎక్కువ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. వరుస ప్లాపుల్లో ఉన్న కొందరు హీరోలు ఈ ఏడాది మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అలాగే కెరీర్ ముగిసినట్టే అనుకున్న హీరోయిన్లు సైతం ఫామ్ లోకి వచ్చారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం స్టార్ హోదా ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచారు. ఆ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Tollywood Actress
Tollywood Actress


సాయి పల్లవి:

Sai Pallavi

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నుంచి ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో తెలిసిందే. వీటి తర్వాత సాయి పల్లవి నుంచి కొత్త ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు..మరో వైపు సినిమాలకు గుడ్ బై చెప్పిందని.. బాలివుడ్ లో ఆఫర్లను అందుకుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -


రష్మిక మందన్నా:

Rashmika Mandanna

గత ఏడాది పుష్ప ది రైజ్‌ తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక.. ఈ ఏడాది కూడా తన హవా కొనసాగించాలని అనుకుంది. కానీ, ఆమె నుంచి ఈ ఏడాది వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు, గుడ్ బై చిత్రాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సీతారామం మంచి విజయం సాధించగా.. అందులో రష్మిక సైడ్ క్యారెక్టర్ కావడం వల్ల ఆమెకు ఒరిగిందేమి లేకుండా పోయింది..ఇప్పుడు మాత్రం వార్తల్లో నిలుస్తుంది..


తమన్నా:

tamanna

మిల్కీ బ్యూటీ తమన్నా నుంచి ఈ ఏడాది నాలుగు చిత్రాలు వచ్చాయి. అందులో ఎఫ్3 మినహా బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బి మరియు గుర్తుందా శీతాకాలం చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి..ఇక సినిమాలు ఇప్పటివరకు సినిమాలు అనౌన్స్ చెయ్యలేదు..


పూజా హెగ్డే:

Pooja Hedge

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకి ఈ ఏడాది ఏమాత్రం కలిసే రాలేదు. 2022లో పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్ చిత్రాలు వచ్చాయి. అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్గా నార్త్ లో పూజ హెగ్డే నటించిన సర్కస్ సైతం ప్రేక్షకులను నిరాశపరిచింది..ఇప్పుడు మళ్ళీ ఇరెన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here