నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ద్వారా బాగా ఫెమస్ అయ్యాడు.. మొదటి షో సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. దాంతో ఇప్పుడు రెండో సీజన్ ను చేస్తున్నారు.ఇప్పటికే చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. చాలామంది ఇండస్ట్రీ జనాలు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా హీరో Prabhas కూడా ఈ షో కి వచ్చారు. ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ టాక్ షో గురించి ఇప్పటికే కొన్ని ప్రోమాలు వచ్చి ఈ ఎపిసోడ్ పై మరింత బజ్ ను తీసుకొని వచ్చాయి..
ఆ షో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ గోపీచంద్ లు వచ్చిన ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఆహా యూనిట్. మొదటి పార్ట్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేస్తే రెండో పార్ట్ జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ షో కి సంబంధించిన మరొక ప్రోమోని రిలీజ్ చేశారు ఆహా యూనిట్. ఈ షోలో బాలకృష్ణ మాట్లాడుతూ.. నువ్వు డార్లింగ్ అని పిలిస్తే దెయ్యాలు కూడా దేవత లుగా మారిపోతాయి అవి కూడా నీ డార్లింగ్ అనే పిలుపుకు ఫీదా అవుతాయి అని అన్నారు.
అంతేకాదు.. అందరూ అడిగే ప్రశ్న..పెళ్ళి ఎప్పుడూ.. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని బాలకృష్ణ అడగడంతో రాసిపెట్టి లేదు సార్ అని ఆన్సర్ ఇచ్చారు. దీనికి బాలకృష్ణ మాట్లాడుతూ మీ అమ్మకు చెప్పిన విషయం నాకు చెప్పకయ్యా అసలు విషయం చెప్పు అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా నీ గర్ల్ ఫ్రెండ్స్ నిన్ను ముద్దుగా ఏమని పిలుస్తారు అని బాలకృష్ణ అడిగితే.. ఏమో సార్ నాకు గుర్తులేదు అసలు నేను వేసుకోవాల్సిన టాబ్లెట్ మర్చిపోయాను. తెలివిగా తప్పించుకున్నాడు.. తర్వాత గోపిచంద్ రావడం షో లో మరింత జోష్ వచ్చింది.. డార్లింగ్ కు అది లేదా అందుకే వద్ధనుకుంటున్నాడా అని కొందరు అంటున్నారు.. ఈ విషయం తెలాలంటే ప్రభాస్ పెళ్లి చేసుకుంటారెమో చూడాలి..