Keerthi : కంటతడి పెట్టిస్తున్న బిగ్ బాస్ కీర్తి స్టోరీ..వీడియో వైరల్..

- Advertisement -

Keerthi : బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న వారంతా ఒక ఎత్తు, బిగ్ బాస్ కీర్తి ఒక ఎత్తు..ఒక మాటలో చెప్పాలంటే స్పెషల్ పర్సన్ అనే చెప్పాలి. జీవితంలో అడుగునా భాధలున్నా కూడా పైకి నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది.అందరికన్నా తక్కువేమి కాదు అని 20 మందితో పోటీ పడుతూ నిరూపించుకుంది.మొదటి రోజు నుంచి ఎంతో డల్ గా కనిపించినా ఆ అమ్మాయి చూసి విసుక్కున్న వాళ్లు.. ఆమె ఎదుర్కొన్న కష్టాలు.. వాటిన్నంటిని ఎదుర్కొంటూ ఒంటరిగా సాగిస్తున్న ప్రయాణం.. తన ప్రవర్తన చూసి టాప్ 3గా స్థానంలో నిల్చొబెట్టారు..ఆమె నిజ జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొందొ వింటే కన్నీళ్ళు ఆగవు..

Keerthi

బిగ్ బాస్ 6 సీజన్లో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. డబ్బులు ఎర చూపిన వద్దంటూ అభిమానులు తనను ఏ పొజిషన్ లో చూడాలనుకుంటున్నారో ఆ స్థానానికే కట్టుబడి ఉంటానంది. అలా మూడో స్థానంలో నిలిచి.. ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కీర్తి.. బిగ్ బాస్ షోతో ఎంతో మంది కుటుంబ సభ్యులను సంపాదించుకుంది..విధి చిన్న చూపు చూడటం తో తన కుటుంబాన్ని ఓ ప్రమాదంలో కోల్పోయింది..ఒక పిల్లాడిని దత్తత తీసుకున్నా అనారోగ్యం కారణంగా చనిపొయాడని చెప్పుకొచ్చింది..

ఇది ఇలా ఉండగా..తాజాగా ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది..అందులో మాట్లాడుతూ.. నేను ఒకతడిని బాగా ఇష్టంగా ప్రేమించాను. కొద్ది రోజులు ఇద్దరం బాగానే ఉన్నాం. కానీ ఓ పరిస్థితిలో అతను నాకు బ్రేకప్ చేప్పి వదిలేశాడు. అందుకు కారణం నాకు వెనకా, ముందు ఎవరూ లేరు.. నాకు పెద్ద బ్యాగ్రౌండ్ లేదు. నేను ఏం చేసి ఇండస్ట్రీకి వచ్చానో అన్న అనుమానంతో వదిలేశాడు. ఇక్కడిదాకా వచ్చిందంటే ఏం చేసి వచ్చిందో అని దగ్గరివాళ్లే చులకనగా మాట్లాడుతుంటే చాలా కష్టంగా ఉంటుంది.అలాంటిది అతడు అర్థం చేసుకుంటారా..అని ఎమొషనల్ అయ్యింది.

- Advertisement -
Keerthi
Big Boss 6 Keerthi

అతడికి అలా అనిపించందంటే నేను తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకున్నట్లే కదా. ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడితే మళ్లీ ఏడ్చుకుంటూ ఉండిపోతాను. ఇప్పుడంతా హ్యాపీగా ఉంది. త్వరలోనే మళ్లీ ఓ పాపను దత్తత తీసుకుంటాను. ‘ అంటూ చెప్పుకొచ్చింది..బిగ్ బాస్ నా బాధలను పొగొట్టింది..ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేస్తూ..సీరియల్స్ లో చేస్తాను అని కీర్తి చెప్పింది..ఆమె మాటలు అందరిని కంటతడి పెట్టించాయి..అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here