Bigg Boss Telugu : బ్రీఫ్‌కేస్ ఆఫర్ ను ఎవరు తీసుకుంటారు..విన్నర్?

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 6 Bigg Boss Telugu ఇప్పుడు తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే..గత సీజన్లలో కన్నా కూడా ఈ యోడు సీజన్లో 21 మంది కంటేస్టేంట్స్ను బిగ్ బాస్ తీసుకొని వచ్చారు.అందరినీ తీసుకొచ్చినా పెద్దగా పాపులర్ అవ్వలేదనే టాక్ వినిపిస్తోంది.మొదటి వారం నుంచే ఈ షో పై ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. ఎలిమినేషన్ పై కూడా విమర్శలు వెల్లువెత్తా యి. ఇక ఈ షోలో ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎటు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదనేది ప్రధాన వాదన. ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ షోపై మరింత నెగిటివిటి పెరిగింది.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

ఇది ఇలా ఉండగా.. ఈరోజు గ్రాండ్ ఫినాలే జరగనుంది..ట్రోఫీని కైవసం చేసుకునేందుకు సింగర్ రేవంత్, రోహిత్ సాహ్ని, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్ ఐదుగురు ఫైనలిస్టులు ఫుల్ జోష్ ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ గా శ్రీ సత్య తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హౌస్లో ఉన్న ఫైనలిస్టుల్లో అందరికీ కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఉన్నాయి. డబ్బుతో కూడిన బ్రీఫ్కేస్ ఆఫర్ బిగ్ బాస్ ఫినాలే రోజు మోస్ట్ ఇంట్రస్టింగ్ టాస్క్. ఈ సంవత్సరం కూడా ఐదుగురు ఫైనలిస్ట్లకు ఈ ఆఫర్ అందజేయనున్నారు హోస్ట్ నాగార్జున. ఈ ఆఫర్ను ఎవరు ఎంచుకుంటే వారు.. డబ్బుతో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.

bigg Boss Telugu 6

ఈ బ్రీఫ్కేస్లో రూ. 25 లక్షలు ఉంటుంది. అది విన్నర్ కోసం ఫిక్స్ చేసిన ప్రైజ్ మనీ 50 లక్షల్లో సగం అన్నమాట. కాగా విన్నర్ ప్రైజ్ మనీ నుంచే కోత పెట్టి ఈ సూట్ కేసు ఆఫర్ ఇస్తారు. కామన్ మ్యాన్ గా షోలోకి అడుగుపెట్టిన ఆది రెడ్డి బిగ్ బాస్ తెలుగు 6 టైటిల్ కంటే డబ్బు ఉన్న బ్రీఫ్కేస్ను ఎంచుకుంటాడని బయట వినిపిస్తుంది.. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో క్యాష్ బ్యాగ్తో ఆది రెడ్డి హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని టాక్. ఎవరీకి తెలియని ఒక సామాన్య మైన వ్యక్తిగా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను.. తన ప్రవర్తన, మాట తీరుతో ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ఫినాలే వరకు వచ్చాడు..

- Advertisement -
Adhi Reddy

ఒకవేళ ఆదిరెడ్డి బ్రీఫ్కేస్ ఆపర్ స్వీకరించకపోతే.. 25 లక్షలు మిస్ అయ్యే చాన్స్ ఉంది. ఇది ఒక సామాన్య వ్యక్తిగా అతనికి పెద్ద అమౌంట్. రేవంత్, శ్రీహాన్ రూపంలో భారీ కాంపిటేషన్ ఉంది. మొదటి నుంచి తెలివిగా ఆలోచించే ఆదిరెడ్డి.. ఈ ఆఫర్ వినియోగించుకుంటాడనే వార్తలొ బిగ్ బాస్ ప్రెక్షకుల్లొ వినిపిస్తోంది. గతంలో బిగ్ బాస్ ఓటీటీలో రూ.10 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేసింది ఫైనలిస్ట్ అరియానా సీజన్ 4లో రూ.25 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేశాడు సొహైల్..ఇప్పుడు ఎవరొస్తారో.. విన్నర్ రేవంత్ అని కంఫార్మ్ అయ్యింది..ఈరోజు జరగనున్న ఎపిసోడ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here