- Advertisement -
మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఇచట వాహనములు నిలుపరాదు, ఖిలాడి వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. Meenakshi Chaudhary అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ అడివి శేష్ హీరోగా వస్తున్న హిట్ 2లో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.
మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. ఈ ఏడాది ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించింది. ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది. అయినా ఈ బ్యూటీకి బాగానే అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అడివి శేష్ తో నటించిన హిట్ 2 డిసెంబర్ 2న విడుదల కానుంది.
మీనాక్షి చౌదరి 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీ వేదిక ఆహాలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
తాజాగా హిట్ 2 ప్రమోషన్స్ లో ఈ బ్యూటీ తెగ అందంగా కనిపించింది. గ్రీన్ కలర్ డ్రెస్సులో మీనాక్షి ముద్దొచ్చేసింది. అడివి శేష్ తో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో మీనాక్షి సందడి చేస్తోంది. ఈ మూవీ హిట్ అయితే ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అవకాశాలు వరుస కట్టేస్తాయని టాక్.