Hit 2 Movie : ‘హిట్‌-2’ పోస్టర్లో జనసేన గ్లాసు.. అడివి శేష్ ఏమన్నాడంటే..?

- Advertisement -

అడివి శేష్‌ హీరోగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ Hit 2 Movie. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు  శైలేశ్‌ కొలను దర్శకుడు. వైజాగ్‌లో జరిగిన ఓ అమ్మాయి హత్య కేసు నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా డిసెంబర్‌ 2న విడుదల కానుంది. మీ ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులంతా ఇది నోయిడాలో జరిగిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసును గుర్తు చేసేలా ఉందని భావిస్తున్నారు. ఆ మర్డర్ కు ఈ సినిమా కథకు సంబంధం ఉందని అనుకుంటున్నారు. దీనిపై హీరో అడివి శేష్ క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా మరి కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకున్నారు.

మా సినిమాలో ఓ అమ్మాయి పేరు శ్రద్ధ అని ఉండటం.. నోయిడాలో జరిగిన ఓ సంఘటననే మా సినిమాలో ఒక కేసుగా వివరించడం.. ఇదంతా అనుకోకుండా జరిగింది. శ్రద్ధా వాకర్‌ సంఘటన జరగడానికి ఎన్నో నెలల ముందే శైలేశ్‌ ఈ కథ రాసుకున్నారు. ‘హిట్‌’ రిలీజైనప్పుడే దిశ సంఘటన జరిగింది. ఇలాంటి ఘటన జరగాలని మేము కోరుకోం. ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది మాత్రమే. అని అడివి శేష్ క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌లో గాజు గ్లాసులో అడివి శేష్ టీ తాగుతుంటాడు. అయితే ఈ గ్లాసు జనసేన గుర్తుకు సంబంధించినదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పోస్టర్ పై ‘జనసేన’ గాజు గ్లాసు ఎందుకు పెట్టారని ఆలోచిస్తున్నారు. దీనిపై శేష్ రియాక్ట్ అయ్యారు. “పవన్‌కల్యాణ్‌, అకీరాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆ విషయానికి అసలు సంబంధం లేదు. ఆ పోస్టర్‌లో ఉన్నది జనసేన గ్లాసు కాదు” అని శేష్ క్లారిఫై చేశారు.

- Advertisement -
Hit 2 Movie
Hit 2 Movie

ఈ సినిమాలో హింస ప్రేరేపించేలా సీన్స్ ఉన్నాయని కొందరు అంటున్నారుని శేష్ అన్నారు. కానీ అలా హింసను ప్రేరేపించే సీన్స్ లేకుండా తన టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు. క్రైమ్‌ సినిమాలు తెరకెక్కించేటప్పుడు దానిలోని తీవ్రతను ఎక్కువగా చూపించకూడదని.. ఒక చెడుపై మంచి ఎలా గెలుస్తుంది? అన్న కోణంలోనే ఈ సినిమా తెరకెక్కించామని చెప్పారు. ఇక, క్రిమినల్‌ మైండ్‌ ఉన్న వాళ్లు కేవలం సినిమాలు చూసే అలాంటి పనులు చేస్తున్నారని అనుకోవడానికి లేదని క్లారిటీ ఇచ్చారు.

హీరో పాత్రలో ఉండే వెటకారం నచ్చి కేడీ పాత్రకు ఓకే చెప్పానని శేష్ అన్నారు. ఈ మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ షూట్ చేశారని తెలిపారు. “వెటకారంగా మాట్లాడే పోలీసే అయినప్పటికీ ఎంతో మంచి వ్యక్తి‌. రెండు విభిన్నమైన కోణాలు కలిగిన వ్యక్తి క్యారెక్టర్‌ ఇది” అని అన్నారు.

“ఈ సినిమా అయితే తెలుగులో డిసెంబర్‌ 2నే విడుదల చేస్తాం. హిందీలో రిలీజ్‌కు కాస్త సమయం తీసుకుంటాం. ఒరిజినల్‌గా దీన్ని మేము తెలుగుకే ప్లాన్‌ చేశాం. కానీ, హిందీ నుంచి రెస్పాన్స్‌ బాగా వస్తోంది. దానివల్ల ఆలోచనలో పడ్డాం. ‘దృశ్యం 2’ కూడా హిందీలో మంచి హిట్ అందుకుంది. దాంతో మాకు నమ్మకం వచ్చింది. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను తెలుగు సినిమా చేసినా, హిందీ సినిమా చేసినా ఇండియన్‌ సినిమా చేస్తా. అది కూడా ఇక్కడ కూర్చొనే చేస్తా. ఈ రెండు ఖాయం. ” అని శేష్ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here