సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం “యశోద” Yashoda. హరి & హరీశ్ డైరెక్షన్ లో వహించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఈ మూవీలో సమంత యాక్టింగ్ కు జనాలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా సామ్ చేసిన ఫైట్లు చూసి ఆశ్చర్యపోయారు. యాక్షన్ సీన్స్ లో సమంత అదరగొట్టేసిందంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు.
సమంత సినిమా ఫస్ట్ వీక్ లో ఎంత వసూలు చేసిందనే లెక్కలు పక్కన పెడితే ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన “యశోద” మూవీకి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీసింది. “యశోద” సినిమా బాక్సాఫీస్ వద్ద ‘థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్’గా నిలిచిందంటూ మేకర్స్ కొన్ని ప్రోమోలను ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేస్తున్నారు. అయితే THRILLING BLOCKBUSTER అనే టైటిల్ హెడ్ లో N,C లెటర్స్ హైలైట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్యను ‘NC’ అని సంబోధిస్తుంటారు. సోషల్ మీడియాలో ఏదైనా మూవీ అప్డేట్ ఇచ్చినా.. సినిమా వర్కింగ్ టైటిల్ అయినా #NC ట్యాగ్ తో మెన్షన్ చేస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘యశోద’ మూవీ ప్రోమోలో NC అని హైలైట్ చేసి ఉండటం చర్చనీయాంశమైంది.
నిజానికి అక్కడ ఆ రెండు లెటర్స్ ని అలా ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు. యశోద సినిమాకు NC ఆంగ్ల అక్షరాలకు ఎలాంటి సంబందం లేదు. అయినా ఇలా హైలైట్ చేయడంతో కావాలనే నాగ చైతన్యని టార్గెట్ చేస్తున్నట్లుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సమంత టీమ్ కావాలని చేసిందా? ఇదంతా ఆమెకి తెలిసే జరిగిందా? లేదా న్యూస్ ఛానల్స్ ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇది నిజంగా చైతూని టార్గెట్ చేసిన పని అయితే ఏమాత్రం సరైంది కాదని ఓ వర్గం ఫ్యాన్స్ అంటున్నారు.
చై – సామ్ విడిపోతున్నట్లు ప్రకటించి కూడా ఏడాది దాటిపోయింది. అయినా పరోక్షంగా ఇలా NC ని టార్గెట్ చేయడం సమంజసం కాదని అక్కినేని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కావాలని చేశారా? యశోద టీమ్ కి తెలియకుండానే జరిగిందా? అనేది తెలియదు కానీ.. సమంత సినిమా ప్రోమోలో NC ని హైలైట్ చేయడం హాట్ టాపిక్ నడుస్తోంది. మరి మేకర్స్ దీనిపై వివరణ ఇస్తారేమో చూడాలి.
ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య – సమంత.. నాలుగేళ్లు తిరక్కుండానే పెళ్లి బంధాన్ని ముగించారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వేర్వేరు మార్గాల్లో జీవితంలో ముందుకు సాగుతున్నారు. విడాకుల తర్వాత సామ్ తన కెరీర్ లో జోష్ పెంచింది. ఇటు టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ అటు బాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు రెడీ అవుతోంది.