బాలీవుడ్ స్టార్​ పార్టీలో అలనాటి తారల సందడి

- Advertisement -

80, 90ల్లో వెండితెరపై ఓ వెలుగు వెలుగు ఇప్పటికీ సిల్వర్ స్క్రీన్​పై తన ప్రయాణం కొనసాగిస్తున్న తారలు ప్రతి ఏటా ఒకచోట కలుస్తారు. ఒకరోజంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. గత స్మృతులు.. ప్రస్తుత పరిస్థితులు.. ఫ్యూచర్ ప్లానింగ్స్ షేర్ చేసుకుంటారు. అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్​ ధరించి సందడిగా గడుపుతారు. ఓ కుటుంబం పిక్​నిక్​ వెళ్లినట్టూ ఈ తారలంతా కూడా ఓ ఫ్యామిలీగా మారి సంబురాలు చేసుకుంటారు.

ప్రతి ఏటా జరిగే ఈ రీయూనియన్ ఈ ఏడాది కూడా జరిగింది. 80ల్లో వెండితెర వేదికగా సందడి చేసిన దక్షిణాది, ఉత్తరాది నటీ నటులందరూ ఒకేచోట కలిశారు. ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. గేమ్స్ ఆడుతూ‌, డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ విందు, వినోద కార్యక్రమాలకు బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ ఆతిథ్యం అందించారు.

- Advertisement -

అలనాటి తారలు ప్రతి ఏటా రీయూనియన్‌ వేడుకలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఒక్కో ఏడాది ఒక్కో స్టార్‌ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 11వ రీయూనియన్‌ వేడుకకు నటుడు జాకీ ష్రాఫ్‌, నటి పూనమ్‌ ధిల్లాన్‌ ఆతిథ్యమిచ్చారు. ముంబయిలో జరిగిన ఈ వేడుకల్లో చిరంజీవి, వెంకటేశ్‌, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్‌, అనుపమ్‌ ఖేర్‌, శరత్‌కుమార్‌, నరేశ్‌, అనిల్‌ కపూర్‌, అర్జున్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 2020లో జరిగిన 10వ రీయూనియన్‌ సెలబ్రేషన్స్‌కు మెగాస్టార్‌ నివాసం వేదికైన విషయం తెలిసిందే. ఆనాటి వేడుకల్లో సుహాసిని, రాధ, జయప్రద, జయసుధ, ఖుష్బూలతో చిరు స్టెప్పులేసి అలరించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here