Waltair Veerayya Trailer : దుమ్మురేపుతున్న ‘వాల్తేరు వీరయ్య ‘ ట్రైలర్..

- Advertisement -


Waltair Veerayya Trailer : మెగాస్టార్ గాస్టార్‌ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్ర పోషించారు. విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్‌ అందరిని ఆకర్షించింది.. చిరంజీవికి తగినట్లుగా Waltair Veerayya Trailer ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు..

Waltair Veerayya Traile
Waltair Veerayya Traile

మొన్నీమధ్య విడుదల అయిన సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబొతుంది… చాలా రోజుల తర్వాత చిరంజీవి పూర్తిస్థాయి మాస్ లుక్ లో కనిపించనుండడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ వరుస అప్డేట్ లతో ప్రేక్షకులలో మంచి హైప్ ని క్రియేట్ చేస్తోంది.

తాజాగా నేడు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఆర్కే బీచ్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగా, మాస్ అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే చిరంజీవి డైలాగ్స్, రవితేజ ఎంట్రీ అదిరిపోయాయి. 2 నిమిషాల 50 సెకండ్లు ఉన్న ఈ ట్రైలర్ అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది..మాస్ ప్రేక్షకులకు మాత్రం ఇది మసాలా ట్రీట్ అనే చెప్పాలి..మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుండో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here