Anchor Suma : ఆ యంగ్ హీరో ఆ వ్యవహారాన్ని బయట పెట్టిన సుమ.. వీడియో వైరల్..

- Advertisement -

Anchor Suma : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు..సుమ కనకాల..తన యాంకరింగ్ తో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే సుమ కనకాల వేరే వినిపిస్తూ ఉంటుంది. ఈవెంట్ లలో,ప్రీ రిలీజ్ వేడుకలలో, ఆడియో ఫంక్షన్ ఇలా ఏ ఈవెంట్ లో చూసిన సుమ కనకాల పేరు వినిపిస్తూ ఉంటుంది. బుల్లితెరపై ముకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది సుమా కనకాల. ఇది ఇలా ఉంటే తాజాగా సుమ సుమ అడ్డా అనే ఒక లేటెస్ట్ ఎంటర్టైన్ ప్రోగ్రామ్ ని మొదలుపెట్టింది..ఈ షో కూడా భారీ రెస్పాన్స్ ను అందుకుంది..ఈ షో మొదటి ఎపిసోడ్ కు వచ్చిన హీరో పర్సనల్ ను అందరి ముందు పెట్టింది.అది కాస్త వైరల్ అవుతుంది..

Anchor Suma
Anchor Suma

ఇప్పటికే కాష్ ప్రోగ్రామ్ కు బుల్లితెర సెలబ్రిటీతోపాటు వెండితెర సెలబ్రిటీలు స్టార్ డైరెక్టర్,ప్రొడ్యూసర్ లు సైతం హాజరయ్యారు. ఇకపోతే తాజాగా సుమ క్యాష్ షో ప్లేసులో సుమ అడ్డా అనే ఒక సరికొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ జనవరి 7న ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే మొదటి ఎపిసోడ్ కి సంబంధించిన అప్పుడు ప్రోమోని తాజాగా షో నిర్వాహకులు విడుదల చేశారు. మొదటి ఎపిసోడ్ కి సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న కళ్యాణం కమనీయం సినిమా టీం పాల్గొన్నారు.

Suma
Suma

అయితే ఈ షోలో కూడా సుమ ఎప్పటిలాగా అలరించింది..అయితే ఆ ప్రోమో లో హీరో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్ లీక్ హైలెట్ అని చెప్పవచ్చు. హీరో మొబైల్ ని స్క్రీన్ కీ కనెక్ట్ చేస్తూ హీరో మొబైల్లో ఏం కనిపిస్తుందో మొత్తం అంతా కూడా బిగ్ స్క్రీన్ లో కనిపించే విధంగా చేసింది సుమ. ఇక హీరో వాట్సాప్ చాట్ లీక్ చేయగా అందులో అనుపమ తో పాటుగా ఎంతోమంది అమ్మాయిలు ఉండడంతో ఏంటిది అని అనగా హీరో సిగ్గుతో తల దించుకున్నాడు..మొత్తానికి ఆ ఎపిసోడ్ హిలయరీస్ గా ఉంది.. ఎపిసోడ్ కోసం టీవీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఆ ప్రోమో మీరు చూసేయ్యండి…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here