Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య ‘ టైటిల్ సాంగ్ రెడీ..ఫ్యాన్స్ కు పండగే..

- Advertisement -

Waltair Veerayya : చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను చేస్తూ వస్తున్నారు.. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమాతో భారీ ప్లాఫ్ అందుకున్నా కూడా ఆ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాతో మంచి టాక్ ను అందుకున్నాడు చిరంజీవి..ఆ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకుంది..ఇప్పుడు డైరెక్టర్ బాబీ తో ‘వాల్తేరు వీరయ్య ‘ సినిమా చేస్తున్నారు.. ఇందులో చిరంజీవి మాస్ మహారాజా రవితేజల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది..

Waltair Veerayya
Waltair Veerayya

ఇకపోతే చిరంజీవి కోసం బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ లు అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరో సంచలన ఆల్బమ్‌ ను అందించాడు. ఆల్బమ్‌ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మూడవ సాంగ్ ను విడుదల చేసే సమయం వచ్చేసింది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. డిసెంబరు 26న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్‌ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

మాస్ బీట్ తో దేవి మెగా ఫ్యాన్స్ కు పునాకాలు తెప్పించె పనిలో పడ్డాడు..అనౌన్స్ మెంట్ పోస్టర్ చిరంజీవిని స్టైలిష్ అవతార్‌ లో ప్రజంట్ చేసింది. పోస్టర్‌ లో చేతిలో పోర్టబుల్ గ్యాస్ బర్నర్ పట్టుకుని కనిపించారు. షేడ్స్‌పై ఫైర్ ఫ్లేమ్స్ ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు.ఈ గెటప్, చిరంజీవి గ్యాస్ బర్నర్ పట్టుకుని చేసిన యాక్ట్ ‘గ్యాంగ్ లీడర్‌’ ను గుర్తు చేస్తుంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీని జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు..ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేశాయి..ఇక సినిమా ఎలా ఉంటుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here