Vijay Deverakonda : ఆ హీరోయిన్ ను బాగా వాడేసిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడేమో..

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో ఊహకు అందని విషయాలు ఎన్నో జరుగుతాయి..తిమ్మిని బమ్మి చేసిన వాళ్ళే చివరికి రోడ్డు పాలు చేస్తారు.. జనాలు నమ్మడం తో పాటు కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే హిట్ సినిమాలు మన ఖాతాలో పడతాయి. హీరో విజయ్ దేవరకొండ లైఫ్ కూడా అలాంటిదే.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. మరో సినిమాతో బోల్తా పడ్డాడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన లైగర్ సినిమా ఏ రేంజ్ లో బోల్తా కొట్టిందో తెలిసిందే.. ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.. హీరోయిన్ పూజా హెగ్డే తో హిట్ కొడదామనుకున్న Vijay Deverakonda కు నిరాశ మిగిలింది దాంతో అమ్మడును దూరం పెట్టేశాడట..

గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి పెళ్లిచూపులు సినిమాల పరువు కూడా ఈ సినిమా తీసేసింది. ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి.. రౌడీ హీరో అనే వాళ్ళు . ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే నత్తోడు.. లైగర్ సినిమా ఫ్లాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి విజయ్ దేవరకొండ నటన కాదు కారణం .. డైరెక్షన్ అని అందరికీ తెలిసిన విషయమే .

Vijay Deverakonda

కాగా సినిమా భారీ హీట్ అవుతుందని నమ్మకంతో విజయ్ దేవరకొండ పూరితో ఆల్రెడీ మరో సినిమాకి కమిట్ అయ్యాడు. జనగణమన డ్రీం ప్రాజెక్ట్ అంటూ ఎన్నోసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా లైగర్ ఫ్లాప్ అవడంతో ఈ సినిమా అటకెక్కింది. అంతేకాదు విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది .

- Advertisement -

ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకోవడంతో పూజా హెగ్డే కెరియర్ అటూ ఇటూ కాకుండా సింగిల్గా మిగిలిపోయింది . అంతేకాదు పూజ హెగ్డేను అడిగి మరి ఈ సినిమాలో పెట్టించుకున్న విజయ్ దేవరకొండ ఆమెను దూరం పెడుతున్నట్లు కూడా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. సక్సెస్ స్టార్ సమంత తో ఎలాగైనా నెక్స్ట్ సినిమా హిట్ కొట్టాలని ఆమెతో మింగిల్ అవుతున్నాడు విజయ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడేమో.. శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండసమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని మూడో షెడ్యూల్ కి రెడీగా ఉంది . కాగా త్వరలోనే ఈ సినిమా మూడో షెడ్యూల్ షురూ కానున్నట్లు తెలుస్తోంది. సమంత హెల్త్ బాగో లేకపోయినా సరే విజయ్ కోసం హెల్త్ ని చక్కబెట్టుకొని ఈ షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధపడిందట. ఈ సినిమా హిట్ అయితే మాత్రం విజయ్ దేవరకొండ కెరియర్ మారిపోవడం ఖాయం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here