‘లైగర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే. ఈ మూవీలో తన లేత అందాలను ఆరబోసిన ఈ బ్యూటీకి ఆశించిన ఫలితం రాలేదు. విడుదలకు ముందు లైగర్ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్, వీడియోస్‌లో Ananya Pandey అందాల విందు చూసి మైమరచిపోయిన యువకులు తీరా సినిమా విడుదల తర్వాత ఈ బ్యూటీని పెద్దగా పట్టించుకోలేదు.
అనన్య సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా తన హాట్ ఫొటోస్ కొన్ని షేర్ చేసింది సోషల్ మీడియాను షేక్ చేసింది. అనన్య షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఎద అందాలతో పాటు ఫుల్ గ్లామర్ డోస్ దట్టిస్తూ హాట్ హాట్‌గా పోజులిచ్చింది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనన్య. రీసెంట్ ఫొటోషూట్‌లో అనన్య బ్యూటీ ట్రీట్ మామూలుగా లేదు. థైస్ ఫిట్ ఔట్ఫిట్లో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ట్రెండీ లుక్స్‌తో యువకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ బ్యూటీ గ్లామర్ షోకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
టాలీవుడ్లో లైగర్ నిరాశపరిచినా.. బాలీవుడ్లో మాత్రం ఈ బ్యూటీకి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది లైగర్, గెహ్రాయియా మూవీస్‌తో అలరించిన ఈ బ్యూటీ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ సూపర్ బిజీగా ఉంది.
అనన్యా తన నెక్స్ట్ ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డ్రీమ్ గర్ల్-2 మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో అనన్యా క్యారెక్టర్ బబ్లీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయుష్మాన్ డ్రీమ్‌గర్ల్ చేశాడు. ఆ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇదే కాకుండా కో గయే హమ్ కహా అనే మూవీలోనూ నటిస్తోంది అనన్య.