Sreeleela : కాజల్ అగర్వాల్ కి కూతురిగా శ్రీలీల..ఇదెక్కడి విచిత్రం అండీ బాబోయి!

- Advertisement -

Sreeleela : వరుస సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడితో చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది..అనిల్ రావిపూడి సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ తో ఫుల్లుగా నిండిపోయి ఉంటుంది..అదే లెవెల్ లో మాస్ ఎలివేషన్ సన్నివేశాలు కూడా ఉంటాయి.

Sreeleela
Sreeleela

ఈ చిత్రం లో కూడా ఇది వరకు మనం ఎన్నడూ చూడని బాలయ్య ని చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి..ఇందులో బాలయ్య బాబు తెలంగాణ యాస మాట్లాడబోతున్నాడట..ఈ విషయాన్నీ అనిల్ రావిపూడి స్వయంగా తెలిపాడు..అయితే ఈ చిత్రం లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించబోతునట్టు సమాచారం..పెళ్లి తర్వాత ఆమె తెలుగు లో నటించబోతున్న మొట్టమొదటి సినిమా ఇదే..అయితే ఇందులో టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా నటించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో శ్రీలీల బాలయ్య బాబు కి కూతురు గా నటించబోతుందట..అంటే కాజల్ అగర్వాల్ కి కూడా కూతురే అన్నమాట..ఇప్పటికి ఎంతో అందమైన లుక్స్ తో కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న కాజల్ అగర్వాల్ ఇలా ఒక హీరోయిన్ కి తల్లి పాత్రలో నటించబోతుందంటే అభిమానులు ఎలా తీసుకుంటారో అని విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -
kajal aggarwal sreeleela

అయితే ఈ సినిమా రెగ్యులర్ టైపు కమర్షియల్ సినిమా కాదని, బాలయ్య మార్కు మాస్ ఉంటూనే కథాంశం చాలా కొత్తదనం తో కూడుకున్న విధంగా ఉంటుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపాడు.. ఇందులో శ్రీలీల కి జోడిగా ఒక యంగ్ హీరో నటిస్తాడు.. ఈ వార్తలన్నీ విన్న తర్వాత నందమూరి అభిమానులు ట్విట్టర్ లో అనిల్ రావిపూడి ని ట్యాగ్ చేసి ‘అసలు ఏమి ప్లాన్ చేస్తున్నావ్ రా మా బాలయ్యతో’ అని అంటున్నారు.. మరి అనిల్ రావిపూడి బాలయ్య తో ఏమి చెయ్యబోతున్నాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here