Veera Simha Reddy vs Waltair Veerayya : కలెక్షన్ సునామీని సృష్టించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు..



Veera Simha Reddy vs Waltair Veerayya : సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్నీ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి.. ముఖ్యంగా బాలకృష్ణ,చిరంజీవి సినిమాలు మాత్రం విడుదల అయ్యి ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. వీరసింహారెడ్డి 4 రోజుల్లో 104 కోట్లు కొల్లగొడితే.. వాల్తేరు వీరయ్య 4 రోజుల్లో 128 కోట్లు రాబట్టింది.. చూస్తున్నారుగా పండక్కి విడుదలైన సినిమాల కలెక్షన్ల ప్రభంజనం.

ఎవరికి వాళ్లు తగ్గేదే లే అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర తుక్కు రేగ్గొడుతున్నారు. మన దగ్గర చిరంజీవి, బాలయ్య.. తమిళంలో విజయ్, అజిత్.. అందరి సినిమాలు పండగ నాలుగు రోజులు కలెక్షన్ల సునామీ సృష్టించాయి.

Veera Simha Reddy and Waltair Veerayya
Veera Simha Reddy vs Waltair Veerayya

అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా కొత్త కథతో రాలేదు.. అన్నీ మూస ఫార్ములాలే. రోటీన్ స్టోరీలే.. ఓటిటిలో బెస్ట్ కంటెంట్ చూస్తున్న ఆడియన్స్‌కు రొటీన్ కథలు బోర్ కొట్టేవి. అదేంటో కానీ.. రెండు మూడు నెలలుగా ప్రేక్షకులకు మూస కథలే బాగా నచ్చేస్తున్నాయి.

ముఖ్యంగా డిసెంబర్‌లో విడుదలైన ధమాకా నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా పరమ రొటీన్ కంటెంట్‌తో వచ్చింది. కానీ కు మాత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. పండక్కి అదే ట్రెండ్ సాగింది. జనవరి 12న వీరసింహారెడ్డి కు యావరేజ్ టాక్ వచ్చింది.. మొదటి రోజు వసూలు సునామీని సృష్టించాయి..

అఖండ ను మించి కలెక్షన్లను అందుకున్నాయి.. బాలయ్య కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా వీరసింహుడి ఊచకోత సాగింది. 5 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల మార్క్ అందుకుంది.. బ్రేక్ ఈవెన్‌కు మరో 15 కోట్ల దూరంలో నిలిచింది. వాల్తేరు వీరయ్య పరిస్థితి కూడా అంతే.

చిరంజీవి మేనియాలోనే ఈ కు వసూళ్లు వచ్చేస్తున్నాయి కానీ కథ పరంగా చూసుకుంటే మాత్రం పాతికేళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే. వారసుడు కథ కూడా నాలుగైదు లను మిక్సీ వేసి తీసినట్లే ఉంటుంది. కానీ విజయ్ మేనియాతో అక్కడ 200 కోట్లకు చేరువైంది.. మొత్తానికి ఈ సంక్రాంతికి స్టార్ హిరొల సినిమాలు దుమ్ము దులిపాయి..