Waltair Veerayya and Veera Simhareddy : వాల్తేరు వీరయ్య-వీరసింహా రెడ్డి సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే



Waltair Veerayya and Veera Simhareddy : సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. పోటాపోటీగా బరిలో దిగిన ఇద్దరు అగ్ర హీరోలు వసూళ్లలోనూ పోటీ పడ్డారు. ఒకే నిర్మాణ సంస్థ.. ఒకే హీరోయిన్.. ఇలా చాలా విషయాల్లో రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి. 

Waltair Veerayya and Veera Simhareddy
Waltair Veerayya and Veera Simhareddy

హీరోయిన్.. బ్యానర్ మాత్రమే కాకుండా ఈ మూవీలో ఉన్న కామన్ పాయింట్ల గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. రెండు సినిమాలు చూసిన ప్రేక్షకులు రెండింట్లో ఉన్న తేడాలు.. పోలికల గురించి చర్చిస్తోంది. ఈ సినిమాల్లో ఉన్న మరికొన్ని కామన్ పాయింట్స్ గురించి మనమూ తెలుసుకుందామా.. 

ఈ రెండు చిత్రాల టైటిళ్లు వెలువడటమే ఆలస్యం పోలిక మొదలైంది. అదే రెండింటిలో ఉన్న ‘వీర’. ఇటు ‘వీర’సింహారెడ్డి.. అటు వాల్తేరు ‘వీర’య్య.

రెండు సినిమాల్లోనూ కథానాయిక శ్రుతిహాసనే

హీరో పాత్రను ఎలివేట్‌ చేసే పాటలు, ఐటెమ్‌ సాంగ్స్‌.

రెండింటిలోనూ తొలి పోరాట దృశ్యాలు పడవ(చిరు)/ఓడ(బాలయ్య)పై చిత్రీకరించినవే.

ప్రథమార్ధంలోని పలు సీన్స్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. (వీరసింహారెడ్డి.. ఇస్తాంబుల్‌/ వీరయ్య.. మలేషియా)

కథానాయకుల తోబుట్టువు (సవతి చెల్లి/ సవతి తమ్ముడు) పాత్రలు కీలకం. సెంటిమెంట్‌కు ప్రాధాన్యం. (వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. రవితేజ)

ఆయా పాత్రలు రెండు సినిమాల్లో ఒకేలా ముగుస్తాయి.

రెండింటి క్లైమాక్స్‌లోనూ ప్రతినాయకుల పాత్ర తల తెగిపడుతుంది.

రెండు సినిమాల దర్శకులు ఆయా హీరోల అభిమానులు. (గోపీచంద్‌ మలినేని- బాలకృష్ణ, కె. బాబీ- చిరంజీవి).

రెండింటి ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఒక్కరే. యాక్షన్‌ కొరియోగ్రఫీ, డ్యాన్స్‌ కొరియోగ్రఫీ విషయానికొస్తే అక్కడ పని చేసినవారే ఇక్కడా చేశారు.

Tags: