Vaishnavi Chaitanya : నాజీవితం ఇంతలా మారిపోతుందని అనుకోలేదు.. గాల్లో తేలిపోతున్న వైష్ణవి చైతన్య

- Advertisement -

Vaishnavi Chaitanya : ‘బేబి’ సినిమాతో వైష్ణవీ చైతన్య గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘లవ్ మీ’ సిద్ధమవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

ఈ వేదికపై వైష్ణవి చైతన్య మాట్లాడింది. ‘లవ్ మీ’ సినిమా టీమ్ చాలా ఫాస్టుగా .. చాలా ఎనర్జిటిక్ గా పనిచేసింది. ఈ సినిమా ఇంత స్పీడ్ గా ఆడియో ఫంక్షన్ వరకూ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు నేను .. మా అమ్మ కలిసి ఆడియో ఫంక్షన్స్ కి వచ్చేవాళ్లం. సినిమావాళ్లు కనిపిస్తారేమోనని .. ఫొటో దిగుదామని వెయిట్ చేసేవాళ్లం. కానీ రెండో సినిమాకే నేను ఆడియో ఫంక్షన్ స్టేజ్ పై ఉన్నాను.

- Advertisement -

నిజంగా ఇది చాలా గొప్ప విషయంలా నాకు అనిపిస్తోంది. సినిమా వాళ్లది వేరే లోకం .. అక్కడికి వెళ్లడం నాలాంటి వారి వలన కాదని నేను అనుకుంటూ ఉండేదానిని. కానీ ఈ రోజున నేను పెద్ద పెద్ద వాళ్లతో కలిసి ఈ ఫంక్షన్ లో ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో నాకే అర్థం కావడం లేదు. నిజంగా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. కీరవాణిగారు నాతో ఓ పాట పాడించడం ఎప్పటికీ మరిచిపోలేను” అని చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here