Samantha : నాగచైతన్యను ఎందుకు మోసం చేశావ్.. నెటిజన్ ప్రశ్నకు చెంప పగలగొట్టేలా ఆన్సర్ ఇచ్చిన సమంత..!

- Advertisement -

హీరోయిన్ Samantha అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ వీరి విడాకులు గురించి ఇప్పటికీ ఎవరో ఆఖరు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. కొందరు ఇలా ప్రశ్నలు వేస్తుంటే, మరికొందరు నిందిస్తూ ఉంటారు. సమంత, చైతన్య మధ్య జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ కొంతమంది సమంతని సపోర్ట్ చేస్తూ చైతన్యని దూషించడం, మరికొంతమంది సమంతని దూషిస్తూ చైతన్యని సపోర్ట్ చేయడం చేస్తుంటారు.

samantha
samantha

తాజాగా ఓ నెటిజెన్ చైతన్య వైపు నుంచి మాట్లాడుతూ.. సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కింద వైరల్ కామెంట్ చేసాడు. ఆ కామెంట్ ఏంటంటే.. “మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు..?” అంటూ ఆ నెటిజెన్ సమంతని ప్రశ్నించారు. ఇక దీనికి సమంత బదులిస్తూ.. “సారీ ఇలాంటివి చేయడం మీకు మంచి కాదు. మీకు ఇంకా బలమైనవి కావలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను” అంటూ కామెంట్ చేసారు. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

samantha naga chaitanya
samantha naga chaitanya

వీటితో మరోసారి చైతన్య సమంత విడాకుల వార్త ట్రేండింగ్ లోకి వచ్చింది. కాగా సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేందుకు సమంత చికిత్స తీసుకుంటున్నారు. ఒక పక్క చికిత్స తీసుకుంటూనే, తనకి వచ్చిన అరుదైన రోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక హెల్త్ పాడ్‌కాస్ట్ ని స్టార్ట్ చేసి.. ఆ సమస్య గురించి అందరికి తెలియజేస్తూ వస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here