Vaarasudu : వారసుడు ‘రిలీజ్‌’ వాయిదా.. బాలయ్య, చిరుకు దిల్ రాజు భయపడ్డాడా..?

- Advertisement -

Vaarasudu : ఇళయదళపతి విజయ్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా.. డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిన సినిమా వారిసు. తెలుగులో ఇది వారసుడుగా రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ విడుదల గురించి మొదటి నుంచి సందిగ్ధతే నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ జనవరి 11న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘వారసుడు’ ( Vaarasudu ) మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ‘వాల్తేరు వీరయ్య’ , ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈమేరకు జనవరి 14న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Vaarasudu
Vaarasudu

‘‘వారసుడు’ రిలీజ్‌ డేట్‌పై గత కొన్నిరోజులుగా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తమిళ వెర్షన్‌ జనవరి 11న విడుదల చేస్తున్నాం. తెలుగులో మాత్రమే 14న విడుదల చేయనున్నాం. పరిశ్రమలో ఉన్న పెద్దలందరితో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. సినిమాపైన నాకు ఉన్న నమ్మకం, మన స్టార్‌హీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ రిలీజ్‌లను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నా.

ఆ రెండు చిత్రాలకూ నా సినిమా పోటీ కాదు. ఎందుకంటే, ఈ సినిమా పూర్తి స్థాయి కుటుంబకథా చిత్రం. గతంలో మా బ్యానర్‌ నుంచి వచ్చిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శతమానం భవతి’ వంటి కుటుంబకథా చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే విధంగా ప్రేక్షకుల్ని అలరించనుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిని చేయాలనే నా ప్రయత్నం. నా నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారు. నేనొక అడుగు వెనక్కి వేశాననే బాధ లేదు. అందరూ ఎప్పుడూ నన్నే విమర్శిస్తుంటారు. ‘పండ్లున్న చెట్టుకేగా రాళ్ల దెబ్బలు’’ అంటూ దిల్‌ రాజు చెప్పుకొచ్చారు.

- Advertisement -
Srikanth and Dil Raju
Srikanth and Dil Raju

“తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్‌ కానుంది. సినిమా కథ బాగుంటే ఏ భాషలోనైనా ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. ‘కాంతార’, ‘లవ్‌టుడే’ చిత్రాలు అందుకు నిదర్శనం. సినిమా చూశాక.. మంచి చిత్రాన్ని చూశామనే భావనతో తెలుగు ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ఇది దిల్‌రాజు బ్రాండ్‌. పూర్తి నమ్మకంతో చెప్పగలను. ఈ సినిమాతో ఒక కొత్త పాయింట్‌ను చెప్పనున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్‌ మాత్రమే ప్రేక్షకులకు గుర్తు ఉంటుంది’’ అని దిల్‌ రాజు అన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం విజయ్ హైదరాబాద్ తప్పకుండా వస్తారని దిల్ రాజు హామీ ఇచ్చారు. ఇక కొందరు డబ్బింగ్ మూవీ కదా తర్వాత రిలీజ్ చేసుకోవచ్చని మాట్లాడుతున్నారని దిల్ రాజు వాపోయారు. “అలా ఎవరైనా మాట్లాడతారా.

మన సినిమాలను కూడా అలాగే చేద్దామా? తర్వాత రామ్‌చరణ్‌తో నా సినిమా ఉంది. ఈ చిత్రాన్ని వేరే రాష్ట్రాల్లో విడుదల చేయవద్దా? నిర్మాతల ఛాంబర్‌ నిర్ణయం ఏమిటంటే.. మొదట తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నేను కూడా ఇప్పుడు అదే కదా చేస్తున్నది. నేను ఎంతో రిస్క్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా. నా జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అయితే పర్వాలేదు. ఒకవేళ నా జడ్జిమెంట్‌ తప్పితే నా పరిస్థితి ఏంటి.” అని దిల్ రాజు అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here