Tamil Actor : ఆయనో స్టార్ హీరో.. కానీ మొబైల్ వాడరట.. ఎందుకో తెలుసా..?

- Advertisement -

Tamil Actor : ప్రజెంట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో మొబైల్ ఫోన్ ఎంత ఇంపార్టెంటో తెలిసిందే. టీవీలేని ఇల్లుందేమో కానీ మొబైల్ లేనీ ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు. స్మార్ట్ ఫోన్ లేకపోతే శ్వాస తీసుకోలేమన్నంతగా లైఫ్ లో ఫోన్ భాగమైపోయింది. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే మొబైల్ ఫోన్ మరింత ఇంపార్టెంట్. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండే సెలబ్రిటీలు.. తమ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మొబైల్ తప్పనిసరి. ఫోన్ ద్వారానే సోషల్​ మీడియా అంటూ ఫ్యాన్స్​కు ఎప్పటికప్పుడు అప్డేట్స్​ ఇస్తూ వారికి దగ్గరవుతుంటారు. అయితే ఇంకా ఫోన్​ వాడని స్టార్స్​ ఉన్నారా అంటే? అవుననే చెప్పాలి. తమిళ స్టార్ హీరో అజిత్ ఈ జాబితాలోకే వస్తారు.

Tamil Actor
Tamil Actor

కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న స్టార్ హీరో అజిత్. అభిమానులు ఈ తమిళ స్టార్​ను ముద్దుగా ‘తల’ అని పిలుస్తారు. మల్టీటాలెంటెడ్​ అయిన ఈ హీరో బయట కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి. అంతే కాకుండా ఎటువంటి సోషల్​ మీడియా హ్యాండిల్స్​ సైతం లేవు. ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే ఈ హీరో సినిమా ఫంక్షన్లలకు సైతం తక్కువగానే హాజరవుతుంటారు. తన పర్సనల్​ లైఫ్​ గురించి అంతగా చెప్పుకోని ఈ స్టార్ గురించి తాజాగా తన కో స్టార్​ త్రిష ఓ సీక్రెట్​ రివీల్​ చేశారు. అదేంటంటే.. ఆయన ఫోన్​ వాడరట.​ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన త్రిషతో ముచ్చటించిన యాంకర్​.. ‘అజిత్ నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేశార’ని అడగగా.. ఈ విషయాన్ని చెప్పింది.

Actor Ajith
Actor Ajith

అజిత్​తో ఎప్పుడూ ఓ మేనేజర్​ ఉంటారట. ఆయనే అజిత్​కు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటారట. అజిత్​ ఎవరితోనైనా మాట్లాడాలన్నా, లేదా అజిత్​తో ఎవరైనా మాట్లాడాలనుకున్న ఈయనే చూసుకుంటారట. అందుకే తల ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ ఉపయోగించరట. మరో విషయం ఏంటంటే.. అజిత్ నటించే ప్రతి చిత్రానికి ఓ కొత్త సిమ్ కార్డ్‌ని తీసుకుంటారట. ఆ సినిమా విడుదలయ్యాక.. మరో కొత్త ప్రాజెక్ట్ మొదలవ్వగానే సిమ్ కార్డ్‌ను మార్చేస్తారట. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులో పనిచేసేటప్పుడు ఆయన దృష్టంతా కేవలం పనిపైనే ఉంటుందని, వేరే విషయాల గురించి పట్టించుకోరని తెలిసింది. దీనివల్ల అనవసరమైన ఫోన్​ కాల్స్​ను ఎత్తాల్సిన అవసరం ఉండదని అలా చేస్తారట.

- Advertisement -

ఇక అజిత్​ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్​లో దూసుకెళ్తోన్న ఆయన​ ఈ సంక్రాంతికి యాక్షన్ థ్రిల్లర్​ ‘తునివు’తో ప్రేక్షకుల మందుకు రానున్నారు. తెలుగులో ‘తెగింపు’ పేరుతో ఈ మూవీ రిలీజ్ కానుంది. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే విడుదలై ట్రైలర్​ కూడా బాగా ఆకట్టుకుంది. మంజు వారియర్ కథానాయిక. సంక్రాంతి పండుగకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here