Unstoppable 2 With NBK : అన్​స్టాపబుల్​ షోలో పవన్ కల్యాణ్.. పవర్​స్టార్​ను బాలయ్య అడగబోయే ప్రశ్నలివే..?

- Advertisement -

Unstoppable 2 With NBK : నందమూరి నటసింహం బాలకృష్ణ ఓవైపు వెండితెరపై వెలుగులీనుతూనే మరోవైపు బుల్లితెరను శాసిస్తున్నారు. ఆహా ఓటీటీలో వస్తోన్న అన్​స్టాపబుల్​ షోకు హోస్టుగా వ్యవహరిస్తూ బాలయ్య అన్​స్టాపబుల్​గా దూసుకెళ్తున్నారు. ఈ షో ఫస్ట్ సీజన్​కు వచ్చిన రెస్పాన్స్ చూసి మేకర్స్ సెకండ్ సీజన్ ప్లాన్ చేశారు. ఇక Unstoppable 2 With NBK గెస్టుల లిస్టు చూస్తుంటే ప్రేక్షకులు వావ్ అనుకుంటున్నారు.

రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానిస్తూ వారి ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. చాలా సీరియస్​గా ఉంటారనుకునే వారిలోని నాటీ యాంగిల్​ను చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు.. శర్వానంద్, అడివి శేష్ వంటి యంగ్ హీరోలు గెస్టులుగా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే.

అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు ఆహా రీసెంట్​గా ఓ సూపర్ సర్​ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​తో ఓ ఎపిసోడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి సంబంధించి గ్లింప్స్, ప్రోమోలు కూడా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలకే కోట్లలో వ్యూస్ వచ్చాయి. ఇక ప్రభాస్​ను ఈ షోలో చూసిన ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరో ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్నారు. అలా చాలా కాలంగా వెయిట్ చేస్తున్న పవర్​స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్​కు కూడా ఆహా ఓ రకంగా సర్​ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ షోకు పవన్​కల్యాణ్ కూడా రాబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో పవన్​-బాలయ్య ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ ఆడియెన్స్​లో నెలకొంది. వీరిద్దరి మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ ఉండబోతోంది, పవన్ వ్యక్తిగత జీవితం గురించి బాలయ్య ఏమని ప్రశ్నిస్తారు? అని చాలా అనుమానాలు అభిమానుల్లో మెదులుతోంది. ఇకపోతే ఈ ఎపిసోడ్​కు దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలిసింది.

ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ ఎపిసోడ్​ గురించి మరో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వచ్చింది. బాలయ్య పవన్​ను ఈ ప్రశ్నలు అడగబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. పవన్ రాజకీయ వ్యవహారాలు, సినిమాల విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటోంది అని బయట చాలా కాలంగా రూమర్ నడుస్తోంది. దాని గురించి బాలయ్య ప్రశ్నించనున్నారట. ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాలు చేయడానికి గల కారణాన్ని బాలయ్య అడగనున్నారట. అలాగే పవన్​-ఓ నటి మధ్య ఉన్న అనుబంధంపై చాలా కాలంగా ప్రచారంలో ఉన్న గాసిప్ గురించి క్లారిటీ తీసుకోబోతున్నారట. ఇంకా టీడీపీ, జనసేన పొత్తు విషయంలో పవన్ అభిప్రాయం ఏంటి అని కూడా అడుగుతారట.

ఇక ఈ ఎపిసోడ్​లో మరో బిగ్ సర్​ప్రైజ్​ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. షో మధ్యలో బాలకృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి మధ్య సరదా ఫోన్ సంభాషణ కూడా ఉండనుందట. పవన్​ను సరదాగా ఆటపట్టించే విషయాలని బాలయ్య చిరంజీవిని అడిగి తెలుసుకోబోతున్నట్లు టాక్. మొత్తంగా ఈ ఎపిసోడ్​ నిజంగా ఉందో లేదో తెలియదు గానీ.. వైరలవుతున్న ఈ ప్రశ్నలు మాత్రం ఆడియెన్స్​లో తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here