Unstoppable With NBK : అన్‌స్టాపబుల్‌ షోలో ప్రభాస్.. రెబల్ స్టార్ ను భయపెట్టిన బాలయ్య

- Advertisement -

Unstoppable With NBK ఆహా ఓటీటీలో అదరగొడుతున్న షోలో నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్న షో నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ -2. ఆహా వేదికగా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ కార్యక్రమం సీజన్‌ 2 షో రన్‌ అవుతోంది. రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో సందడి చేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు మరో మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డితోపాటు విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నగడ్డ, శర్వానంద్, అడివి శేష్, అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, కె.రాఘవేంద్రరావు వంటి వారు పాల్గొన్నారు. 

Unstoppable With NBK
Unstoppable With NBK

తాజాగా ఈ షోలో  పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సందడి చేశారు. తన స్నేహితుడు, నటుడు గోపీచంద్‌తో కలిసి బాలయ్య షోలో పాల్గొన్నారు. అయితే తాజాగా ఆహా టీమ్​ ఓ చిన్న సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఓ చిన్న గ్లింప్స్​ను విడుదల చేసింది. 

ఇందులో.. ఫస్ట్ టైమ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ టాక్ షోకు వస్తున్నారని గ్రాండ్‌గా స్వాగతం పలికారు. ప్రభాస్‌ ఎంట్రీ అదిరిపోయేలా ఉండటం విశేషం. డార్లింగ్​ను చూసి ఆడియెన్స్ హోరెత్తించారు. ఫ్లైయింగ్‌ కిస్సులతో ఫిదా చేశారు. వారికి డార్లింగ్‌ కూడా ఫ్లయింగ్‌ కిస్సులివ్వడం విశేషం. ఇక ప్రభాస్​ అయితే ‘ఏం చెబుతున్నావ్‌ డార్లింగ్‌’ అంటూ ఒక్క డైలాగ్‌తో ఆకట్టుకున్నారు.

- Advertisement -

ఇక ప్రభాస్​ వచ్చాక బాలకృష్ణ కాస్త సరదా సన్నివేశాలు చేశారు. కళ్లజోడు పైకి ఎగరేశారు. ఆ తర్వాత ‘ఏయ్‌.. ఏం చెప్తున్నావ్‌ డార్లింగ్‌’ అని ప్రభాస్‌ నవ్వుతూ చెప్పడం నవ్వులు పూయించింది. మరోవైపు ప్రభాస్‌ను.. బాలయ్య రమ్మని అనగా, డార్లింగ్‌ వద్దు సర్‌ అన్నట్టుగా దూరం వెళ్లిపోవడం ఆకట్టుకుంటుంది. మరోవైపు ఓకే సోఫాలో కూర్చొన్న గోపీచంద్‌కు ప్రభాస్‌ పెద్ద దెండం పెట్టి మీరు గొప్ప అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం కూడా నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్​మీడియాలో ఫుల్​ ట్రెండ్ అవుతోంది. కాగా, ఈ కార్యక్రమంలో పెళ్లి గురించి ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here