Tollywood Actress : సినిమా ఇండస్ట్రీలో 20 ఏళ్ల భామలైనా సరే అవకాశమొస్తే 60 ఏళ్ల ముసలి హీరోలతో నటిస్తారు. ఇక ఆ హీరోలు సూపర్ స్టార్లయితే వాళ్ల కెరీర్ దూసుకెళ్తుంది. ఇలా హీరోయిన్లు కేవలం యంగ్ హీరోలతోనే కాదు మంచి అవకాశమొస్తే అగ్ర హీరోలతోనూ నటిస్తారు. అలా తండ్రీ కొడుకులతో నటించిన కొందరు Tollywood Actress ఉన్నారు. మరి వాళ్లెవరు.. ఏయే సినిమాల్లో నటించారో తెలుసుకుందామాా
అతిలోక సుందరి శ్రీదేవి ఏఎన్నాఆర్ సరసన కథానాయికగా నటించారు. ఆ తర్వాత అక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగార్జున సినిమాలోనూ నాయికగా నటించి ఆశ్చర్యపరిచారు. తండ్రీ కొడుకులతో అవకాశం అందుకున్న ఏకైక నాయికగా..శ్రీదేవి పేరు అప్పట్లో మార్మోగింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ఇటు రామ్ చరణ్ తో అటు మెగాస్టార్ చిరంజీవితోనూ రొమాన్స్ చేశారు. మగధీర- నాయక్- గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో చరణ్ సరసన నటించిన కాజల్.. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150లో నటించారు.
మెగా కాంపౌండ్ లో తండ్రీ కొడుకులతో నటించిన ఘనత మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు కూడా దక్కింది. తమన్నా- చరణ్ సరసన రచ్చ చిత్రంలో నటించారు. తర్వాత సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి సరసన నాయికగా కనిపించారు. మెగా బాస్ తో పాటు చరణ్ తోనూ పోటీపడి డ్యాన్సులు చేయడంలో నటించడంలో తమన్నాకు మంచి మార్కులే పడ్డాయి.
పంజాబి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా అక్కినేని కాంపౌండ్ లో నటించారు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నాగచైతన్య తో రొమాన్స్ చేసిన రకుల్ ప్రీత్ ఆ తర్వాత మన్మథుడు2లో నాగార్జున తోనూ రొమాన్స్ చేశారు.
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి – నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా.. చైతన్య యుద్ధం శరణం చిత్రాల్లో నటించారు.
రెండు జనరేషన్లలో తండ్రీ కొడుకులతో నటించే అవకాశం చాలా అరుదుగా కొందరికే దక్కేది. అలాంటి అరుదైన అవకాశం ఇటీవల శ్రుతిహాసన్ కు దక్కింది. చిరంజీవి వారసుడు రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ మూవీలో హీరోయిన్ గా నటించిన శ్రుతిహాసన్ లేటెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’లో కూడా హీరోయిన్ గా నటించింది.