Luckycharm : ఆ బాలీవుడ్ స్టార్​ హీరో లక్కీఛార్మ్ టబు.. అందుకే తొమ్మిదోసారి కూడా..

- Advertisement -

Luckycharm : సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్ రిపీట్​ చేయడం అనేది కామన్. కానీ అలా రిపీట్ చేయాలంటే.. ఆ కాంబోను ప్రేక్షకులు బాగా ఆదరించి ఉండాలి.. లేదా ఆ కాంబో బాక్సాఫీస్ రికార్డ్స్ షేక్ చేసి ఉండాలి. అలా ఇప్పటి వరకు చాలా కాంబోలు అదరగొట్టాయి. మహా అయితే కొన్ని జోడీలు నాలుగైదు సార్లు జతగడతాయి. కానీ ఓ జంట మాత్రం ఏకంగా తొమ్మిది సార్లు కలిసి నటించింది.

Luckycharm
Luckycharm

బాలీవుడ్​లో షారుఖ్-కాజోల్, వరుణ్ ధావన్-ఆలియా జంటలు చాలా ఫేమస్. వీళ్లు కలిసి నటించిన సినిమాల లిస్టు కాస్త పెద్దదిగానే ఉంది. కానీ వీళ్ల కంటే ఎక్కువసార్లు కలిసి నటించిన ఓ జోడీ ఉంది. అయితే ఈ జోడీ హీరో-హీరోయిన్ జోడీ అని చెప్పలేం. ఎందుకంటే వీళ్లు ఇప్పటి వరకు తొమ్మిది సార్లు కలిసి నటించారు. అయితే కొన్నిసార్లు హీరో-హీరోయిన్లుగా.. మరికొన్ని సార్లు.. కీలక పాత్రల్లో నటించారు. ఇంతకీ ఆ జోడీ ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరు.. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్, వెటరన్ హీరోయిన్ టబు.

అజయ్ దేవగణ్-టబు కలిసి ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలు చేశారు. ఇప్పుడు తొమ్మిదో సినిమాకు రెడీ అవుతున్నారు. దేదే ప్యార్ దే, దృశ్యం, దృశ్యం-2, గోల్​మాల్ అగైన్.. ఇలా ఎనిమిది సినిమాల్లో నటించి.. ఇప్పుడు తొమ్మిదో మూవీ భోళాతో మరోసారి సందడి చేయడానికి వస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ `భోళా. 3డీ ఫార్మాట్ లో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని అజయ్ దేవగన్ తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -
Bhola
Bhola

2019లో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన `ఖైదీ` తమిళ తెలుగు భాషల్లో ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ మూవీకి రీమేక్ గా `భోళా`ని 3డీ లో అజయ్ దేవగన్ తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్​కు లక్కీ ఛార్మ్​గా మారిన టబు `భోళా`తో తన మ్యాజిక్​ని కంటిన్యూ చేస్తుందో తెలియాలంటే మార్చి 30 వరకు వేచి చూడాల్సిందే.

2022లో ఢీలా పడ్డ బాలీవుడ్ బాక్సాఫీస్​ను అజయ్ దేవగణ్ దృశ్యం-2 ఆదుకుంది. ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ఆశలు చిగురించేలా చేసింది. అజయ్ దేవగణ్​కు భారీ విజయాన్ని అందించింది. దీంతో ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్​తో ఉన్న అజయ్ దేవగణ్​ తన లక్ష్మీ ఛార్మ్ టబుతో తొమ్మిదో సారి కలిసి నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here