మరోసారి నెట్టింట తమన్నా పెళ్లి కబుర్లు.. వింత జబ్బు ఉన్న వ్యక్తితో వివాహం..!తాము అభిమానించే హీరో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని ప్రతి అభిమానికి ఉత్సాహంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం వల్ల లేనిపోని పుకార్లు మొదలవుతాయి. అలాంటి ఓ పుకారే టాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియాకు ఎదురైంది. అదేంటంటే ఆమె పెళ్లి విషయం. ఇప్పటికే తమన్నా పెళ్లి పై సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ నడుస్తోంది. ఈ విషయంపై ట్యామీ క్లారిటీ కూడా ఇచ్చింది.

తమన్నా పెళ్లి / Tamannaah Marriage
తమన్నా పెళ్లి / Tamannaah Marriage

తమన్నా క్లారిటీతో కూడా సంతృప్తి పడని కొందరు మరో చర్చకు తెరలేపారు. తమన్నా.. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి ఓ పుకారు పుట్టించారు. ఇప్పుడది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీనిపై ట్యామీ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. మళ్లీ తమన్నా ఈ రూమర్​పై కూడా రియాక్ట్ అయ్యి అందరు నోర్లు మూయిస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ రూమర్ ఏంటంటే..

తమన్నా పెల్లి గురించి ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్​గా వైరల్ అవుతోంది. అదేంటంటే.. తమన్నా పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి వేల కోట్ల ఆస్తి ఉందట. అంతే కాదు అతడు ఒక్కడే వారసుడట. ఇందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటారా.. అసలు పుకారు ఇది కాదు. ఆ వ్యక్తికి ఓ వింత జబ్బు ఉందట. ఆ వింత జబ్బు కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా వస్తుందట.

తమన్నా పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఓ వింత జబ్బు ఉందట. అతడు ఏదైనా తనకు పడని ఫుడ్ తింటే వెంటనే రియాక్షన్ అవుతుందట. చర్మంపై రాషెస్ వచ్చేస్తాయట. వీలైనంత త్వరగా చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమట. ఈ పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అసలు తమన్నా పెళ్లి చేసుకోబోతోందా లేదో తెలియదు కానీ ఆమెకు కాబోయే వాడి గురించి మాత్రం సామాజిక మాధ్యమాల్లో చిత్రవిచిత్రమైన విషయాలు చర్చకు వస్తున్నాయి.

తమన్నాకు కాబోయే వాడికి ఉన్న జబ్బు గురించిన పుకార్లు విన్న కొందరు.. ఇంత తెలిసీ ఆమె అతణ్ని ఎందుకు పెళ్లి చేసుకుంటోందని విస్తుపోతున్నారు. మరికొందరేమో అతణ్ని పెళ్లి చేసుకోవాలనుకోవడానికి గల కారణం అతడికి ఉన్న ఆస్తేనని అంటున్నారు. ఏదేమైనా టాలీవుడ్ హాట్ బ్యూటీ ఇలా జబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటా అని ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.

ఇటీవలే తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు తమన్నా ఓ స్ట్రాంగ్ రిప్లైతో చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ‘ఇతనే నా భర్త (వ్యాపారవేత్త)’ అంటూ తాను ఇటీవల నటించిన ‘ఎఫ్‌ 3’ సినిమాలోని పాత్రకు సంబంధించిన క్లిప్పింగ్‌ను పోస్ట్‌ చేసింది. ‘మ్యారేజ్‌ రూమర్స్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేసింది. ఆ చిత్రంలో తమన్నా కొన్ని సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించింది. ఆ దృశ్యాలనే ఆమె పంచుకుంది. తన పెళ్లి రూమర్స్​పై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన తమన్నా.. ఇప్పుడు తనకు కాబోయే వాడి గురించి వస్తున్న పుకార్లపై స్పందిస్తుందో లేదో చూడాలి. ఈసారి ట్యామీ రిప్లై ఏంటా అని నెటిజన్లు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన తమన్నా ప్రస్తుతం చిరంజీవితో ‘భోళా శంకర్’లో నటిస్తోంది. సత్యదేవ్‌ సరసన నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితోపాటు ఆమె డైరీలో హిందీ, మలయాళ సినిమాలున్నాయి.