Rashmika Mandanna Photos : రెడ్​డ్రెస్​లో రష్మిక.. చూసీ చూడంగానే నచ్చేశావే అంటూ పాడేసుకుంటున్న కుర్రాళ్లు

- Advertisement -

మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని కుర్రాళ్లను అడిగితే టక్కున చెప్పే పేరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కిరిక్ పార్టీతో తెరంగేట్రం చేసిన ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్​లో యంగ్ హీరో నాగశౌర్యతో నటించిన చలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రష్మికను చూసిన యువత చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగుకుండా వచ్చేశావే.. నా మనసులోకి.. అంటూ పాడేసుకున్నారు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీత గోవిందంతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది.

Rashmika Mandanna Photos
Rashmika Mandanna Photos

విజయ్​తోనే మరో సినిమా డియర్ కామ్రేడ్​లో నటించి వీళ్లిద్దరు టాలీవుడ్ లవ్లీ పెయిర్​గా పేరు తెచ్చుకున్నారు. ఇక వరుస సినిమాలతో రష్మిక టాలీవుడ్, కోలీవుడ్, శాండల్​వుడ్​లో తన జోష్ చూపిస్తోంది. ఈ అమ్మడుకున్న క్రేజ్ చూసి బాలీవుడ్ ఆఫర్లు కూడా తలుపుతట్టాయి. ఇటీవలే తన ఫస్ట్ బాలీవుడ్ మూవీలో బిగ్​బీ అమితాబ్ బచ్చన్ పక్కన నటించింది. గుడ్​బై మూవీతో బీ టౌన్ ప్రేక్షకులను పలకరించింది.

 

- Advertisement -

సాధారణంగా రష్మిక అందం, క్యూట్​నెస్​కు ఫిదా అయిన ముంబయి వాసులు.. గుడ్​బై సినిమాతో ఈ బ్యూటీ నటనకు కూడా ఫిదా అయ్యారు. ఇంకేంటి బీ టౌన్​లోనూ ఆఫర్లు క్యూ కట్టాయి ఈ భామ కోసం. రణ్​బీర్ కపూర్ సరసన ఎనిమల్​, సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో రష్మిక నటిస్తోంది. ఇవే కాకుండా ఇళయదళపతి విజయ్​తో వారిసులో సందడి చేస్తోంది.

టాలీవుడ్​లో ఇటీవలే విడుదలైన సీతా రామమ్ లో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇటు గ్లామర్​ రోల్స్​తో పాటు అటు నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనూ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్​ మీడియాలోనూ బాగా యాక్టివ్​గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్​ ఫోటోలను షేర్​ చేస్తూ ఉంటుంది. అందుకే ఫేస్​బుక్​, ఇన్​స్టాలో మిలియన్ల మంది రష్మికను ఫాలో అవుతుంటారు. స్టైల్​ సిగ్నేచర్​గా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ భామని ప్రస్తుతం అందరూ నేషనల్​ క్రష్​గా పిలుస్తున్నారు.

 

సోషల్ మీడియాలో తాజాగా పోస్టు చేసిన Rashmika Mandanna Photos వైరల్ అవుతున్నాయి. ఎరుపు రంగు ట్రెడిషనల్​వేర్​లో ఈ భామ చాలా ముద్దుగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రకాలు ఊరికే నేషనల్ క్రష్ అన్నామా.. రెడ్​ డ్రెస్​లో క్యూటీ సూపర్​గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here