Meera Jasmine : ముసలి హీరోలతో నటించనన్న పవన్ కల్యాణ్ హీరోయిన్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

- Advertisement -

మీరా జాస్మిన్.. టాలీవుడ్​ను శాసించిన మలయాళ బ్యూటీస్​లో ఈమె ఒకరు. మాలీవుడ్​లో చాలా మంది కథానాయికలు టాలీవుడ్​ తెరపై సందడి చేశారు. అందులో Meera Jasmine ప్రత్యేకమైన స్థానం. కుర్రహీరోల నుంచి స్టార్ హీరోల వరకు దాదాపు అందరితోనూ ఈ బ్యూటీ జత కట్టింది. ఒక దశలో తెలుగు తెరపై తనదైన జోష్​ను నింపింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.

 

పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ మలయాళ కుట్టి గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో యమ యాక్టివ్​గా ఉంటోంది. గ్లామరస్ ఫొటో షూట్స్​తో.. హాట్ హాట్ పోజులతో కుర్రకారు మదిని దోచేస్తోంది. ఎలాగైనా సరై మళ్లీ ఇండస్ట్రీలో పాగా వేయాలని తెగ ఆరాటపడుతోంది. ఎప్పటికప్పుడు తన అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు తనని మరిచిపోకుండా వాళ్ల మనసులో తన గ్లామర్ ముద్ర వేస్తోంది మీరా. అంతే కాదు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ ఘాటు అందాలతో తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో సెగలు పుట్టిస్తోంది.

- Advertisement -

సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది మీరా జాస్మిన్. ఆ ప్రయత్నంలోనే మీరా జాస్మిన్​కు విక్టరీ వెంకటేష్​తో నటించే అవకాశం వచ్చిందట. నారప్ప సినిమాలో హీరోయిన్​గా మీరాను తీసుకోవాలి అనుకున్నారట. అయితే వెంకీతో నటించనని ముఖం మీదే చెప్పేసిందట ఈ భామ. అంతటితో ఆగకుండా సంచలన వ్యాఖ్యలు చేసిందట.

Meera Jasmine
Meera Jasmine

వెంకటేష్ ఒకప్పుడు హీరో ఇప్పుడు కాదు.. ముసలోడు అయిపోయారు కదా అంటూ డైరెక్టర్ ముందే చెప్పుకొచ్చిందట ఈ మలయాళ కుట్టి. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోని అంత మాట అందా.. ఎంత తలపొగరు ఈ హీరోయిన్​కు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మీరా నో చెప్పడంతో వెంకీ సరసన నటించే అవకాశం ప్రియమణి దక్కించుకుంది. ఆ మూవీ తర్వాత ప్రియ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్​లు చేస్తుండటం గమనార్హం.

వెంకీతోనే కాదు బాలయ్య బాబు సినిమాలో కూడా అవకాశం వస్తే నో చెప్పిందట. నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కోసం గోపీచంద్ మలినేని ఆమెను అప్రోచ్ అవ్వగా ఈ ఆఫర్ కూడా రిజెక్ట్ చేసిందట. మంచి మంచి ఆఫర్లను పోగొట్టుకుంటున్న మీరా జాస్మీన్ కుర్ర హీరోల సరసన ఛాన్స్ కావాలంటుందట. ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. యువ హీరోలు నీలాంటి వయసు మళ్లిన హీరోయిన్​తో ఎందుకు వర్క్ చేస్తారు అని కామెంట్ చేస్తున్నారు.

యువ హీరోలతో సినిమాలు వర్కవుట్ కాకపోతే మంచి గ్లామర్ ట్రీట్ ఉన్న రోల్స్​తో రీఎంట్రీ ఇవ్వడానికి మీరా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అటు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో యువతను ఫిదా చేస్తోందట. ఇటేమో సీనియర్ హీరోలకు వరుసగా నో చెప్పేస్తోంది. మరి ఈ విషయంపై మీరా ఇంకా పెదవి విప్పలేదు. ఏదేమైనా తెలుగు తెరపై మళ్లీ మీరా జాస్మిన్​ను చూడాలని మాత్రం ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి కొన్నాళ్లు తన అందంతో మాయ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here