Bigg Boss :శివాజీని కోలుకోలేని దెబ్బ కొట్టిన అమర్.. ఇప్పుడేం చేస్తాడో పాపం..



Bigg Boss లో పవర్ అస్త్రా ఎవరికి దక్కుతుంది అనే అంశమే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. దీనికోసం జరుగుతున్న పోటీలు, టాస్కులు, దీని వల్ల కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న గొడవలు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో రెండు వారాలు ముగిశాయి. ఈ రెండు వారాల్లో రెండు పవర్ అస్త్రాలను ఇద్దరు కంటెస్టెంట్స్ దక్కించుకున్నారు. వారే సందీప్, శివాజీ. కానీ మిగతా కంటెస్టెంట్స్‌లో పలువురు కలిసి.. సందీప్‌పై ఉపయోగించిన స్ట్రాటజీని శివాజీపై కూడా ఉపయోగించారు. పవర్ అస్త్రా పోటీలో గెలిచిన కంటెస్టెంట్స్‌కు రెండు షీల్డ్స్‌ను అస్త్రాలుగా అందజేశారు బిగ్ బాస్.

Bigg Boss
Bigg Boss

ముందుగా మొదటి వారంలో ఆ పవర్ అస్త్రా షీల్డ్‌ను అందుకున్న కంటెస్టెంట్ సందీప్. అయితే ఆ పవర్ అస్త్రాను కాపాడుకోవాలని, కాపాడుకోలేకపోతే మెల్లగా బ్యాటరీ తగ్గిపోతుందని తనకంటూ ఒక బ్యాటరీని కూడా ఇచ్చారు. ఆ బ్యాటరీ రెడ్‌లోకి వచ్చేస్తే.. పవర్ అస్త్రాకు ఉన్న పవర్స్ అన్నీ పోతాయని బిగ్ బాస్ ముందే వార్నింగ్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకున్న కంటెస్టెంట్స్.. తన పవర్ అస్త్రాను కొట్టేసి దాచేశారు. ఈ విషయాన్ని మరికొందరు కంటెస్టెంట్స్.. తనకు లీక్ చేశారు. దీంతో అలర్ట్ అయిన సందీప్.. అతి తక్కువ సమయంలోనే తన పవర్ అస్త్రాను కాపాడుకోగలిగాడు. దీంతో బ్యాటరీ కూడా సేవ్ అయ్యింది. అదే స్ట్రాటజీని శివాజీపై కూడా ఉపయోగించాలని అనుకున్నాడు అమర్‌దీప్. కానీ అది తనకే రివర్స్ అయ్యింది.

amar deep palavi prashanth

రెండో వారంలో రెండు గ్రూపులుగా విడిపోయి పవర్ అస్త్రా కోసం పోటీపడ్డారు కంటెస్టెంట్స్. అందులో చివరిగా శివాజీనే పవర్ అస్త్రా వరించింది. అయితే శివాజీతో పవర్ అస్త్రా కోసం పోటీపడి ఓడిపోయిన అమర్‌దీప్.. ఆ అస్త్రాన్ని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. శోభా శెట్టితో కలిసి ప్లాన్ గురించి చర్చించాడు. కచ్చితంగా ఆ పవర్ అస్త్రాను కొట్టేస్తానని అన్నాడు. అనుకున్నట్టుగానే ఎవరూ లేని సమయంలో ఆ పవర్ అస్త్రాను కొట్టేసిన అమర్‌దీప్.. కాసేపు అయిన తర్వాత తన పవర్ అస్త్రా పోయిందని గమనించిన శివాజీ.. కంటెస్టెంట్స్‌తో ఈ విషయాన్ని చెప్పాడు. తీసినవారిని క్షమించేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.