Actress Laya : పూనకాలు లోడింగ్ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన లయ.. వీడియో వైరల్..

- Advertisement -

సీనియర్ Actress Laya స్క్రీన్ మీద కనిపించి చాలా కాలం అయ్యింది..పెళ్లి తర్వాత అమెరికా వెళ్లిపోయిన ఈ నటి.. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉండిపోయింది. అయితే.. తాజాగా మెగాస్టార్ Chiranjeevi నటించిన వాల్తేరు వీరయ్య మూవీలోని పూనకాలు లోడింగ్ పాటకి తన స్నేహితురాలితో కలిసి డ్యాన్స్ చేసి వీడియోను షేర్ చేసింది. రెండు దశాబ్దాల క్రితం టాప్ హీరోయిన్స్లో ఒకరుగా ఉన్న లయ.. పాటకి డ్యాన్స్ చేసిన తీరుని చూసిన అభిమానులు.. రీఎంట్రీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ వాల్తేరు వీరయ్య..సంక్రాంతి కానుకగా 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. చిరంజీవి, రవితేజ కలిసి రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాలో మళ్లీ నటించగా.. చిరుకి జోడీగా శృతిహాసన్, రవితేజకి జోడీగా కేథరిన్ ఈ సినిమాలో నటించింది. అలానే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఓ ఐటెం సాంగ్ చేసింది. సినిమా హిట్‌ టాక్‌ని సొంతం చేసుకోగా.. మూవీలోని పాటలన్నీ హిట్‌గా నిలిచాయి. దాంతో చాలా మంది టాప్ సెలెబ్రిటీలు ఈ మూవీలోని పాటలకి డ్యాన్స్ చేసి రిల్స్‌ని పోస్ట్ చేస్తున్నారు.

Actress Laya
Actress Laya

స్వయం వరం సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లయ..తమిళ్, కన్నడతో పాటు మలయాళంలోనూ సినిమాలు చేసింది. ఫస్ట్ నుంచి హోమ్లీ క్యారెక్టర్స్ చేసిన లయ ఓ రెండు మూడు సినిమాల్లో మాత్రమే గ్లామర్ రోల్స్ చేసింది. శివాజీతో ఎక్కువ సినిమాలు చేసిన ఈ సీనియర్ హీరోయిన్.. నందమూరి బాలకృష్ణతోనూ విజయేంద్ర వర్మ సినిమాలో యాక్ట్ చేసింది. లయ చివరిగా తెలుగులో నటించిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. రవితేజ హీరోగా చేసిన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో మళ్లీ సినిమాలకి లయ దూరమైపోయింది. అయితే.. గతంలో ఆమెతో కలిసి నటించిన చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు రీఎంట్రీ ఇస్తున్నారు.. సంగీత, టబు వీళ్ళు రీ ఎంట్రీ ఇచ్చి చాలా బిజీ అయ్యారు.లయ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆమెకు ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి..

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here