Waltair Veerayya First Review: చిరు, రవితేజ కాంబో సూపర్..మాస్ ట్రీట్..పూనకాలే..

- Advertisement -

Waltair Veerayya : తెలుగు స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న మాస్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ రేపు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 13వ తేదీన థియేటర్ల వద్ద టపాసుల మోత మోగించేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై చిత్ర యూనిట్ చాలా ఆశలు పెట్టుకుంది… ఇలాంటి సినిమాకు విడుదలకు ముందే రివ్యూ వచ్చేసింది. ఇదే ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ రివ్యూ.

Waltair Veerayya
Waltair Veerayya

.

ప్రతి సినిమాకు లాగా ఈ సినిమాకు కూడా రివ్యూను ఇచ్చారు ఉమైర్ సందు.. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా, సినీ విమర్శకుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ రెండు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చేశాడు. ‘వీరసింహారెడ్డి’ సినిమా మొన్న రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు నేడు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు.

- Advertisement -
Waltair Veerayya


ఈ సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌ ఇచ్చారు.ఈ సినిమా చిరంజీవికి బెస్ట్ కమ్‌బ్యాక్ అని కొనియాడాడు. రవితేజ, చిరంజీవి కాంబో అదిరిపోయిందని.. ఇద్దరూ కలిసి వెండితెరపై అద్భుతం చేశారని పేర్కొన్నాడు. ఇదొక మసాలా పాప్‌కార్న్ మూవీ అని అన్నాడు. సినిమాకు మంచి కథ, సంగీతం కుదిరాయని చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ సినిమాకు 3 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు.

ఈయన నిన్న వీర సింహారెడ్డి 3.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఇక చిరు సినిమాకు మాత్రం 3 రేటింగ్ ను ఇచ్చారు. నిజానికి ఈయన బాగుంది అన్న సినిమాలు అన్నీ కూడా బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టాయి..అట్టర్ ఫ్లాప్ అని చెప్పిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. కాబట్టి, ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలకు ఇచ్చిన రేటింగ్‌లు ఎలా తీసుకోవాలో కూడా చెప్పలేం..ఇప్పటివరకు ‘వాల్తేరు వీరయ్య మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. రేపు ఉదయం ఈ సినిమా విడుదల కానుంది..మరి జనాలను ఏవిధంగా మెప్పించి హిట్ టాక్ ను అందుకుంటుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here