Hrithik Roshan : హృతిక్ రోషన్​ లగ్జరీ కార్ కలెక్షన్ చూశారా..?

- Advertisement -

Hrithik Roshan : బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంటే అమ్మాయిలు పడిచచ్చిపోతుంటారు. ఇక అబ్బాయిలు ఈ హీరో అందం, ఫిజిక్ చుసి అసూయ పడుతుంటారు. సామాన్య ప్రేక్షకుల నుంచి బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్ల వరకు హృతిక్ అంటే చాలా మందికి పిచ్చి.

Hrithik Roshan
Hrithik Roshan

బాలీవుడ్​ మోస్ట్ ఫిట్​ యాక్టర్​.. ది మోస్ట్ హ్యాండ్సమ్​ హంక్​గా పేరు తెచ్చుకున్నాడు హృతిక్ రోషన్. కోయి మిల్ గయా సినిమాతో అరంగేట్రం చేసి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. వరుస అవకాశాలతో బీ టౌన్​లో ఈ హీరో దూసుకెళ్తున్నాడు.

Actor Hrithik roshan
Actor Hrithik roshan

ఇక క్రిష్ ఫ్రాంచైజీతో సూపర్ హీరో అయిపోయాడు హృతిక్ రోషన్. సిల్వర్ స్క్రీన్​పై క్రిష్​లా పవర్​ఫుల్ స్టంట్లు చేసే హృతిక్​కు.. రోడ్డుపైనా రయ్​రయ్ మంటూ దూసుకెళ్లడమంటే ఇష్టమట. హృతిక్ రోషన్​కు కార్లంటే చాలా ఇష్టమట. అందుకే కొత్తగా ఏ కారు వచ్చినా కొనేస్తూ ఉంటాడట. చాలా రకాల లగ్జరీ కార్లు హృతిక్ గ్యారేజ్​లో ఉన్నాయట. మరి అవేంటో ఓ లుక్కేద్దామా..?

- Advertisement -
Rolls Royce

హృతిక్​ వద్ద రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ ఉంది. దీని ధర దాదాపు 5 కోట్ల 32 లక్షలు. 42వ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ ఈ కారును కొనుగోలు చేశాడని సమాచారం.

Mercedes Benz S

Mercedes Benz S క్లాస్ కూడా హృతిక్​ గ్యారేజ్​లో ఉంది. దీని ఖరీదు 2 కోట్లు 80 లక్షల వరకూ ఉంటుంది.

Mercedes V

Mercedes V క్లాస్ ను సైతం ఇంటికి ఆహ్వానించాడు బాలీవుడ్​ హీరో. దీని విలువ కోటిన్నర వరకు ఉంటుందని అంచనా.

మినీ కూపర్

మినీ కూపర్ కన్వర్టిబుల్ కూడా హృతిక్ కలెక్షన్​లో ఉంది. దీని ధర 40 లక్షల వరకూ ఉంటుంది. రోజువారీ అవసరాల కోసం హృతిక్ దీన్నే వినియోగిస్తాడని టాక్.

ఫెరారీ 360

హృతిక్​ గ్యారేజ్​లో మరో ఖరీదైన కారు ఫెరారీ 360 మోడెనా కూడా ఉంది. మన దేశంలో అతి తక్కువ మంది దగ్గర ఈ కారు ఉంది. దీని ధర 4 కోట్లు.

ఫోర్డ్ ముస్తాంగ్

హృతిక్ వద్ద అరుదైన 1996 నాటి ఫోర్డ్ ముస్తాంగ్​ వింటేజ్ కారు కూడా ఉంది. ఈ కారు మోడల్​ అందుబాటులో లేక చాలా కాలమైంది.

పొర్షే టర్బో

పోర్షే టర్బో కారుకు సైతం వెల్కమ్​ చెప్పాడు హృతిక్. దీని ధర 2 కోట్ల మేర ఉంటుంది.

Maseratispyder

జెట్​ స్పీడుతో దూసుకెళ్లే Maserati Spyder కూడా హృతిక్​ వద్ద ఉంది. దీని విలువ రెండున్నర కోట్ల మేర ఉంటుందని అంచనా.

Audi Q7

హృతిక్ దగ్గర Audi Q7 మోడల్​ కూడా ఉంది. దీని ధర కోటి 10 లక్షల వరకు ఉంటుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here