Casting Couch : ఆ డైరెక్టర్,రైటర్ ఇద్దరూ ఫుల్లుగా చూస్తేనే హీరోయిన్లకు ఛాన్స్ వస్తుందా?

- Advertisement -

Casting Couch : సినీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఒక రొచ్చు అంటున్నారు కొందరు ప్రముఖులు..అవకాశాలు రావాలి అంటే ఎవరోకరికి కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అంటున్నారు. దీనిపై చాలా మంది ముద్దుగుమ్మలు నోరు విప్పారు..కొంతమంది పరోక్షంగా తాము ఎదుర్కొన్న పరిస్థితులను తెలుపుతున్నారు.అయితే ఇండస్ట్రీలో హీరోయిన్గా రానించాలి అంటే ఆ డైరెక్టర్, రైటర్ తో పక్క పంచుకొవాలని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీని గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి..
మాములుగా కమిట్‌మెంట్ అంటే హీరోగానీ, హీరోయిన్‌గానీ సినిమా ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇచ్చిన డేట్స్ ప్రకారం అనుకున్న సమయానికి పని పూర్తి చేయాలి.. కేవలం హీరో, హీరోయిన్స్ విషయంలో మాత్రమే కాదు.. 26 శాఖలకీ చెందిన ప్రతీ ఒక్కరికీ ఇదే రూల్ వర్తిస్తుంది. కానీ, ఒక్క హీరోయిన్ విషయంలో ఇదే కమిట్‌మెంట్ పదానికి ఇంకో అర్థం కూడా ఉంది.

ఆ పదం గతంలో ఎక్కువగా బాలీవుడ్‌లో వినిపించేది. కానీ, గతకొన్ని ఏళ్ళ నుంచి మన టాలీవుడ్, కోలీవుడ్ సహా మిగతా సౌత్ భాషలలో కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడ కమిట్‌మెంట్ అంటే సినిమా ఒప్పందం చేసుకునే ముందే మేకర్స్‌తో సన్నిహితంగా ఉండాలని మాట్లాడుకుంటారు. కొందరు దీని అధికారికంగా అగ్రిమెంట్‌లోనూ జత చేస్తారు. మరికొందరు మాత్రం పరస్పర అంగీకారంతో ఒప్పందం చేసుకుంటారు. ఇక్కడ కమిట్మెంట్ అనే పదాన్ని ఇటీవల కొందరు స్టైలిష్‌గా కాస్టింగ్ కౌచ్ అంటూ చెబుతున్నారు.

Srireddy On Casting Couch
Srireddy On Casting Couch

అయితే ఇలాంటివి ఇష్ట పూర్వకంగానే జరుగుతుందని కొందరు అంటున్నారు.. కానీ, కొందరు నటీమణులు అవకాశం ఇస్తామని మమ్మల్ని వాడుకొని వదిలేశామని రోడ్డెక్కుతున్నారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం శ్రీరెడ్డి. నిజంగా ఆమెను చూస్తే జాలి పడాల్సిందే. అంత నమ్మకంగా న దగ్గర ఆధారాలున్నాయి అన్నారంటే ఎంతమంది ప్రబుద్ధులు వాడుకున్నారో చెప్పక్కర్లేదు.

- Advertisement -

అంతకముందు మాధవీలత కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నానని చెప్పారు. బోయ సునీత విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ప్రముఖ నిర్మాత విషయం లేవనెత్తి ఆఫీస్ ముందు కూర్చున్న సంగతి ఎంత వైరల్ అయిందో తెలిసిందే. మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో హిట్ సినిమాలను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ ఇలా అడగడం నీచం..ఇక స్టార్ హీరోయిన్ల సినిమాలకు రైటర్ గా పనిచేసిన వ్యక్తి కూడా ఇలా అడగటం దారుణం..కేవలం వాళ్ళు మాత్రమే కాదు ఇంకా చాలా మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు..వారంతా ఎప్పుడూ మారతారో అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here