Saindhav Review : సినిమా మొత్తం కాల్పుల మోతే!

- Advertisement -

Saindhav Review : విక్టరీ వెంకటేష్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్న సోలో చిత్రం ‘సైంధవ్’. గత కొన్నేళ్ల నుండి ఆయన ఎక్కువగా మల్టీస్టార్రర్ సినిమాలను మాత్రమే చేస్తూ వచ్చేవాడు. మధ్యలో చేసిన కొన్ని సోలో హీరో చిత్రాలు ‘నారప్ప’ మరియు ‘దృశ్యం 2’ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ లో విడుదలయ్యాయి. వెంకటేష్ అభిమానులు తమ అభిమాన హీరో ని వెండితెర మీద పూర్తి స్థాయి సోలో చిత్రం ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న సమయం లో ‘సైంధవ్’ చిత్రాన్ని ప్రకటించారు మేకర్స్.

వెంకటేష్ 75 వ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమా పై వెంకటేష్ అభిమానులతో పాటుగా ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలను పెంచుకుంటూ వెళ్లాయి. అలా భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరించిందో ఈ రివ్యూ లో చూసి తెలుసుకుందాం.

కథ :

- Advertisement -
Saindhav Review
Saindhav Review

చంద్రప్రస్థ అనే నగరం లో సైంధవ్ కొలను(వెంకటేష్) అలియాస్ సైకో తన కూతురు గాయత్రీ (బేబీ సరా) తో కలిసి ఎంతో సంతోషంగా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా సాగిపోతున్న వారి జీవితం లోకి భర్త నుండి విడిపోయిన మనో (శ్రద్ద శ్రీనాథ్) అనే అమ్మాయి వస్తుంది. ఆమె వెంకటేష్ తో ప్రేమలో పడుతుంది. అలా సాగుతూ ఉండగా తన కూతురు గాయత్రీ కి ‘స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ’ అనే ప్రాణాంతక వ్యాధి ఉందని తెలుస్తుంది.

ఈ వ్యాధి కి నివారణ జరగాలంటే 17 కోట్ల రూపాయిల విలువ చేసే ఇంజక్షన్ కావాలి. అంత డబ్బు ‘సైంధవ్’ ఎలా సంపాదించాడు, తన కూతురు గాయత్రీ ని ఎలా కాపుడుకున్నాడు అనే అంశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇంతలో ‘సైంధవ్’ కి ఫ్లాష్ బ్యాక్ లో కార్టెల్ సంస్థలో పని చేసి ఉండడాన్ని చూపిస్తారు. కానీ తన భార్య కి ఇచ్చిన మాట ప్రకారం ఆ సంస్థ నుండి దూరంగా వచ్చేసి తన కూతురితో గడుపుతుంటాడు. చిన్న పిల్లలను అక్రమంగా రవాణా చేస్తూ, ఆయుధాలను సర్పహారా చేస్తూ ఉండే వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) తో సైంధవ్ కి ఉన్న శత్రుత్వం ఏమిటి?, చివరికి తన కూతురు ప్రాణాలను సైంధవ్ కాపాడుకున్నాడా లేదా అనేది మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

శైలేష్ కొలను దర్శకత్వం యాక్షన్ సినిమా వస్తుంది అంటే అంచనాలు ఉండడం సర్వసాధారణం. ఆయన గత చిత్రాలను ఒక్కసారి చూస్తే అన్నీ థ్రిల్లింగ్ తో కూడుకున్న సబ్జక్ట్స్. కానీ ఈ సినిమాలో ఆ థ్రిల్ ఎలెమెంట్స్ మిస్ అయ్యాయి. సినిమా కథ అద్భుతంగా ఉంది, కానీ కథనం, స్క్రీన్ ప్లే ని నడిపించిన విధానం చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. అందుకే చూసే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మామూలు సినిమాగానే అనిపిస్తుంది.

తండ్రీ కూతుర్ల మధ్య సన్నివేశాలను ఎంతో ఎమోషనల్ గా ఆడియన్స్ కి హృదయాలకు హత్తుకునేలా చేసే స్కోప్ ఈ చిత్రం లో ఉంది. కానీ డైరెక్టర్ అది వాడుకోలేదు, ఎంతసేపు ఆయన ద్రుష్టి మొత్తం యాక్షన్ సన్నివేశాల పైనే ఉంది. అలా సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కాల్పుల మోత తప్ప రక్తికట్టించే స్క్రీన్ ప్లే ని రాసుకోలేకపోయాడు డైరెక్టర్.

ఇక విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది..?, ఎలాంటి పాత్రలో అయినా జీవించే వెంకటేష్, ఈ పాత్రలో కూడా చింపేసాడు. యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషన్ సన్నివేశాల్లో ఆయన మార్క్ ఏంటో చూపించి సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసాడు. ఇక వెంకటేష్ తర్వాత మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది, ఈ సినిమాలో విలన్ గా చేసిన నవజ్జుధిం సిద్ధిఖీ గురించి. ఆయన పాత్ర చాలా గమ్మత్తుగా, ఆడియన్స్ ని భయపెట్టే విధంగా ఉంటుంది.

ఇక మిగిలిన నటీనటులు శ్రద్ద శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, రుహాని శర్మ తదితరులు తమ పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. ఓవరాల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాలో కథ , కంటెంట్ ఉంది కానీ, ఆసక్తికరమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మాత్రం లేదు. ఇక సంతోష్ నరణయం అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజి గా అనిపించాయి.

చివరి మాట :

ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ చిత్రం కనెక్ట్ అయ్యే అవకాశం లేదు కానీ, యాక్షన్ మూవీ లవర్స్ కి మాత్రం నచుతుంది.

నటీనటులు : విక్టరీ వెంకటేష్, శ్రద్ద శ్రీనాథ్, ఆర్య,ఆండ్రియా జారేమియా, నవాజుద్దీన్ సిద్దిఖీ, రుహాని శర్మ, సరా పాలెక్కర్ తదితరులు.
రచన – దర్శకత్వం : శైలేష్ కొలను
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాత : వెంకట్ బోయినపల్లి

రేటింగ్ : 2.75/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here