Hanuman Movie లో హనుమంతుడి క్యారక్టర్ చేసిన స్టార్ హీరో అతనేనా..? ఎవ్వరూ కనిపెట్టలేకపోయారుగా!

- Advertisement -

Hanuman Movie : నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘హనుమాన్’. థియేటర్స్ లో చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు గూస్ బంప్స్ ని రప్పించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వ ప్రతిభ కి సెల్యూట్ చేసారు. ఎందుకంటే రాజమౌళి డైరెక్టర్లు క్వాలిటీ ప్రోడక్ట్ ని రాబట్టుకోవడానికి వందల కోట్ల రూపాయిల బడ్జెట్ ని నిర్మాతలతో ఖర్చు చేయిస్తారు.

Hanuman Movie
Hanuman Movie

అంతే కాకుండా సంవత్సరాల తరబడి సినిమాలను తీస్తూనే ఉంటారు. కానీ ప్రశాంత్ వర్మ కేవలం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఈ రేంజ్ క్వాలిటీ ఔట్పుట్ ని రాబట్టాడంటే సాధారమైన విషయం కాదు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు, అలాగే క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు చూసినప్పుడు ఆడియన్స్ ఒళ్ళు జలదరించింది.

Hanuman Movie

ఇకపోతే ఈ సినిమాలో హనుమంతుడి క్యారక్టర్ ఎవరు చేసారు అనే దానిపై ఇంకా ఆడియన్స్ లో ఒక చిన్న అయ్యోమయ్యం ఉంది. ఈ కళ్ళు ఎక్కడో చూసామే అని అనిపిస్తుంది కానీ ఎవరు అనేది కచ్చితంగా కనిపెట్టలేకపోయారు. కానీ ఆ హనుమాన్ పాత్రని పోషించింది మరెవరో కాదు, దగ్గుపాటి రానా అట. రీసెంట్ గా ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన రానా ఈ సినిమా గురించి తన మనసులోని మాటల్ని పంచుకున్నాడు.

- Advertisement -
Hanuman

కానీ ఈ చిత్రం లో నటించాడని విషయం మాత్రం లీక్ చెయ్యలేదు. కానీ ఈ సినిమాలో హనుమంతుడు పాత్ర పోషించింది మాత్రం రానా అని, ఆయన పాత్ర రెండవ భాగం లో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. హనుమంతుడిని వెండితెర మీద చూసిన ప్రతీసారి ఆడియన్స్ కి థియేటర్స్ లో పూనకాలు వచ్చాయి. హనుమతుడిగా ఇంత చక్కగా ఇమిడిపోయాడు రానా, ఆయన్ని తప్ప ఈ పాత్రలో ఎవ్వరినీ ఊహించుకోలేం అని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here