RRR Movie : ఆస్కార్ అవార్డు విజేతగా ‘#RRR’.. రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రతిభ కి దాసోహమైన హాలీవుడ్!

- Advertisement -

RRR Movie : వరుసగా అంతర్జాతీయ అవార్డ్స్ ని సొంతం చేసుకున్న #RRR చిత్రం, ప్రతీ ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్స్ లో కూడా నామినేట్ అయ్యి సంచలనం సృష్టించింది. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో నామినేషన్ దక్కించుకోగా, ఈ అవార్డు ఆ పాట కి వస్తుందా రాదో అనే టెన్షన్ కేవలం మన తెలుగు ఆడియన్స్ కి మాత్రమే కాదు, ప్రతీ ఇండియన్ లోను ఉండేది.ఎలా అయినా ఈ అవార్డు మనకే రావాలని ప్రతీ ఒక్కరు దేవుళ్ళకు మొక్కుకున్నారు.

RRR Movie
RRR Movie

చివరికి అందరి ప్రార్థనలు ఫలించి ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కింది.ఎంతో మంది దిగ్గజ హాలీవుడ్ దర్శకులు,నటీనటులు మరియు ప్రముఖ టెక్నిషియన్స్ కరతధ్వనుల నడుమ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ అవార్డుని అందుకున్నాడు.ఇది నిజంగా మన తెలుగు జాతి మొత్తం ఎంతో గర్వించదగ్గ విషయం.

కీరవాణి ఆస్కార్ అవార్డు అందుకున్నప్పటికీ కూడా, ఆ పాట అంత రేంజ్ లో రీచ్ అవ్వడానికి కారణం మాత్రం హీరోలే.ప్రపంచ నలుమూళ్లల్లో ఉన్న ప్రతీ సినీ అభిమాని పైకి లేచి కేరింతలు కొట్టడానికి ప్రధాన కారణం వాళ్ళు వేసిన అద్భుతమైన డ్యాన్స్.వీళ్ళతో అలాంటి స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫేర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి కూడా అదే రేంజ్ గౌరవం దక్కుతుంది.

- Advertisement -

ఇక ఈ పాట సరైన సందర్భం లో ఉండాలి, ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి వచ్చేలా ఉండాలి అని పాట అద్భుతంగా వచ్చేందుకు పర్ఫెక్షన్ చూపించిన రాజమౌళి కి కూడా అదే రేంజ్ క్రెడిట్ రావాలి.పేరు కి కీరవాణికి మాత్రమే అవార్డు వచ్చినప్పటికీ రామ్ చరణ్ , ఎన్టీఆర్ , ప్రేమ్ రక్షిత్ మరియు కీరవాణి ప్రతిభ కి ఆస్కార్ అవార్డు ప్రదానం దక్కినట్టే.ఇక ఈ పాటకి ఆస్కార్ అవార్డు దక్కినందుకు గాను ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల కేరింతలకు హద్దు అదుపు లేకుండా పోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here