Ram Charan : హాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో రామ్ చరణ్ భేటీ.. అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయ్యే వార్త

- Advertisement -

Ram Charan : RRR మూవీ రాజమౌళి కి మరియు జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత ఉపయోగపడిందో చెప్పలేము కానీ, రామ్ చరణ్ కి మాత్రం ఒక రేంజ్ లో ఉపయోగపడింది అని చెప్పొచ్చు. అంతర్జాతీయ స్థాయి లో నేడు ఆయనకీ లభిస్తున్న గౌరవం చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఈ రేంజ్ కి చేరుకోవడం ఎవరికైనా అసాధ్యమే అనేంతలా అనిపిస్తుంది.

Ram Charan
Ram Charan

మొన్నీమధ్యనే HCA అవార్డుని సొంతం చేసుకొని సెన్సేషన్ సృష్టించిన రామ్ చరణ్ , ఇప్పుడు హాలీవుడ్ లో స్టార్ వార్స్ వంటి ఆల్ టైం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తీసిన JJ అబ్రామ్స్ రామ్ చరణ్ ని తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానించి సుమారు గంట సేపు పైగా సుదీర్ఘ చర్చలు జరిపాడు.ది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది.రామ్ చరణ్ గత కొద్దీ రోజుల క్రితమే ఒక ప్రముఖ హాలీవుడ్ మీడియా కి త్వరలోనే తాను హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాను అని తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

Ram Charan hollywood movie

ఆ ప్రాజెక్ట్ మరెవరితోనో కాదు JJ బ్రామ్స్ తోనే అట..ఒక భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఆయన రామ్ చరణ్ ని హీరో గా పెట్టి తియ్యబోతున్నారని.సోనీ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నారని టాక్.దీనికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 27 వ తారీఖున తెలియజెయ్యనున్నారు.ఈ ప్రాజెక్ట్ మొత్తం హాలీవుడ్ నటీనటులు మరియు హాలీవుడ్ టెక్నిషియన్స్ తోనే ఉంటుందట.మన తెలుగు మరియు సౌత్ యాక్టర్స్ ఇందులో నటించే అవకాశం లేదని తెలుస్తుంది.

- Advertisement -

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. రామ్ చరణ్ హాలీవుడ్ లోకి ఎదో ఒకరోజు ఎంట్రీ ఇస్తాడని అందరూ ఊహించారు కానీ, ఇంత పెద్ద ప్రాజెక్ట్ తో ఎంట్రీ ఇస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న టాలీవుడ్ సినిమాలన్నీ పూర్తి అయినా తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతుందని సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here