RRR Movie : ఆస్కార్ వేడుకకు RRR టీమ్​.. రెడ్​కార్పెట్​పై ఎన్టీఆర్, చరణ్ బ్రొమాన్స్

- Advertisement -

RRR Movie : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా.. ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. హాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, తారలతో పాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ సంబురానికి తరలివచ్చారు. హాలీవుడ్ తారమణులు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకుల కలను అడుగు దూరంలో నిలిపిన ఆర్.ఆర్.ఆర్ చిత్రబృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RRR Movie
RRR Movie

ఆస్కార్ అవార్డుల వేడుకకు ఆర్ఆర్ఆర్ సినిమా టీమ్ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఈ సినిమా హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు బ్లాక్ కలర్ ఔట్​ఫిట్​లో రాయల్ ఎంట్రీ ఇచ్చారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లైట్ మెరున్ కలర్ శర్వాణీలో హాజరయ్యారు. ఇక నాటు నాటు పాట పాడిన సింగర్స్ కాల భైరవ బ్లాక్ శర్వాణీలో కనిపించగా.. రాహుల్ సిప్లిగంజ్ యాష్ కలర్ శర్వాణీలో, నాటు నాటు సాంగ్ కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ బ్లాక్ కలర్ శర్వాణీలో వేడుకకు వచ్చారు.

NTR Rajamouli Ram Charan
Rrr

మరోవైపు రెడ్​కార్పెట్​పై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి రెడ్​ కార్పెట్​పై నడిచారు. ఇది తన భార్యకు తాను ఇస్తున్న ది బెస్ట్ గిఫ్ట్ అని రామ్ చరణ్ అన్నారు. ఉపాసన ప్రస్తుతం ఆరు నెలల గర్భిణీ అని తెలిపారు. అక్కడున్న రిపోర్టర్లు, కెమెరామెన్లు చరణ్-ఉపాసనలకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
Ram charan Upasana Konidela
Ram Charan and upasana

ఇక ఆస్కార్ రెడ్ కార్పెట్ వేదికపై మరో అద్భుత సంఘటన చోటుచేసుకుంది. చాలా రోజులుగా అమెరికాలోనే ఉన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. కలిసి మాత్రం ఒక్కసారిగా కూడా కనిపించలేదు. వీరిద్దరు కలిసి కనిపించాలని ప్రేక్షకులు చాలా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆ క్షణం వచ్చింది. రెడ్ కార్పెట్​పై చరణ్, తారక్​లు కలిసి మెరిసారు. వారిని అమెరికన్ రిపోర్టర్ పలకరించారు.తారక్, చరణ్​లు కలిసిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఎన్నాళ్లైంది చూసి బ్రో అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఇది చూసి షాకైన అక్కడి రిపోర్టర్.. ఏంటీ మీరు ఇన్ని రోజులు కలవలేదా..? ఇప్పుడే మీట్ అవుతున్నారా అని ప్రశ్నించారు. దానికి చరణ్ సమాధానమిస్తూ.. అవును.. తారక్ చాలా బిజీగా ఉన్నాడు కలవలేకపోయాడని అన్నారు. ఆ తర్వాత తారక్ చూశారా.. బ్లాక్ కలర్ శర్వాణీలో సూపర్ కూల్​గా కనిపిస్తున్నాడు అని రిపోర్టర్​తో చెప్పారు. ఇక తారక్​ను మీకు వదిలేస్తున్నానను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక రిపోర్టర్.. మీరు ఆస్కార్ వద్దుక చేరుకున్నారు ఎట్టకేలకు అనగా.. ఎన్టీఆర్ దానికి సమాధానమిస్తూ.. అవునూ.. చివరకు చేరుకున్నాం చాలా ఆనందంగా.. ఉత్సాహంగా కాస్త టెన్షన్​గా కూడా ఉందంటూ సమాధానమిచ్చాడు. ఆస్కార్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగుతోంది. తెలుగు పాట ‘నాటు నాటు’ను ఆస్కార్‌ వేదికగా ప్రదర్శించారు. హాలీవుడ్‌ డ్యాన్సర్లు ఈ పాటకు చిందులేశారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here