RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..జనసేనాని పవన్ కల్యాణ్, మెగా బ్రదర్ నాగబాబులపై మళ్లీ సెటైర్లు వేశారు. తన అధికారిక ట్విట్టర్ లో ఓ వీడియోను విడుదల చేసిన ఆయన కొణిదెల నాగబాబు గారూ..అంటూ మాటల తూటాలను పేల్చాడు.అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ కు నాగబాబు ప్రియమైన వ్యక్తి కావొచ్చేమో గానీ తనకు కాదన్నారు.
తాను జనసేన పార్టీ మీద కానీ, పవన్ కల్యాణ్ మీద గానీ పెట్టిన ట్వీట్లు ఓ అభిమానిగా చేసినవేనన్నారు. అయితే వారికి అర్థం కాకపోవడం తన దురదృష్టమని, తన కంటే ఎక్కువ పవన్ కల్యాణ్ దురదృష్టకరమని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
RGV
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కలుసుకుని రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని, సంక్రాంతి సందర్భంగా వారు తనను పిలిస్తే ఇక్కడికి వచ్చానన్నారు. ఈ సందర్భంగానే నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా.. తన గురించి నాగబాబు ఏం మట్లాడారో తెలియదని, దాని గురించి తాను వినలేదని చెప్పారు. వాటిని విన్న తరువాత స్పందిస్తానని చెప్పుకొచ్చారు వర్మ..ఇప్పుడు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..