Chiranjeevi : చిరంజీవి ఫోన్ లో పవన్ కల్యాణ్ పేరు ఎలా సేవ్ చేసి ఉంటుందో తెలుసా..?

- Advertisement -

Chiranjeevi : వాల్తేర్ వీరయ్య సినిమా తో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో దిగారు. ఈ సినిమా విడుదలైన రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు బాక్స్ ఆఫీసు వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. వాల్తేరు వీరయ్య కంటే ఒక రోజు ముందు వీర సింహా రెడ్డి సినిమా తో సంక్రాంతి సందడి షురూ చేశారు. అయితే వాల్తేరు వీరయ్య రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ప్రేక్షకుల ఫోకస్ అంతా వీరయ్య పైనే పడింది. దీంతో బాక్స్ ఆఫీసు వద్ద బాలయ్య పై చిరు పై చేయి సాదిస్తున్నట్టు అయింది.

Chiranjeevi and Pawan Kalyan
Chiranjeevi and Pawan Kalyan

ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇందులో భాగంగానే ఈటీవిలో ప్రసారం అయ్యే సుమ అడ్డా షో కు గెస్ట్ గా వెళ్లారు. ఈ షో లో చిరంజీవి ఫుల్ ఫన్ అందించారు. సుమ తో కలిసి చిరు ప్రేక్షులను ఫుల్ గా ఎంటరటైన్ చేశారు. ఇక ఈ షో లో మెగాస్టార్ తనకి సంబందించిన చాలా సీక్రెట్స్ చెప్పారు.

ఈ షో లో సుమ చిరంజీవినీ ఆయన మొబైల్ లో తన భార్య సురేఖ పేరు ఏమని సేవ్ చేసి ఉందని అడగ్గా దానికి చిరు కాస్త సిగ్గు పడ్డారు. దీంతో సుమ తో పాటు అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ తర్వాత చిరు తన మొబైల్ లో సురేఖ పేరు ” రే” అని సేవ్ చేసి ఉంటుంది అని చెప్పారు. దానికి సుమ రే అంటే Ray of Hope అని వివరణ ఇవ్వగా దానికి చిరు అలానే.. కానీ ఇంకో అర్థం కూడా ఉందంటూ.. రేయ్.. అరేయ్.. అంటూ ఉంటాం కదా అలా కూడా అని చెప్పారు.

- Advertisement -

తర్వాత చిరు నీ సుమ తన మొబైల్ లో రామ్ చరణ్, నాగబాబు, పవన్ కల్యాణ్ పేర్లు ఏమని సేవ్ చేసి ఉన్నాయి అని అడగ్గా.. చరణ్ పేరు చెర్రీ అని.. నాగబాబు పేరు నాగబాబు అని.. పవన్ కల్యాణ్ పేరు.. కల్యాణ్ బాబు అని సేవ్ చేసి ఉంటుంది అని చెప్పారు. పవన్ కల్యాణ్ పేరు వినబడగానే షో లో ఆడియన్స్ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. ఈ షో లో సుమ ఇంకా చాలా విషయాలను చెప్పించించింది చిరంజీవితో. అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here