Ravi Kishan : నాన్నే నన్ను చంపాలనుకున్నాడు.. అల్లు అర్జున్ విలన్ ఇన్ని కష్టాలు పడ్డాడా..!

- Advertisement -

Ravi Kishan : అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా రేసుగుర్రం. బన్నీ తన యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఈ సినిమా హిట్ లిస్టులో కూడా చేరిపోయింది. విలన్ గా నటించిన రవికిషన్ కూడా బాగానే గుర్తుంటాడు. మద్దాలి శివారెడ్డి అనే పాత్రకు ఆయన నిజంగా జీవం పోసి నటించారని చెప్పవచ్చు. భోజ్ పూరి నటుడైన ఈయన ఆ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్నాడు. టాలీవుడ్ లో ఆ సినిమా తర్వాత కూడా అనేక సినిమాలలో విలన్ గా నటించి మనల్ని మెప్పించారు.

ఒకవైపు ఇలా ఉండగా మరోవైపు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే తాజాగా రవి కిషన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రవి కిషన్ మాట్లాడుతూ.. మా నాన్నకి చాలా కోపం ఎక్కువని.. తనని ఎప్పుడూ కొడుతూనే ఉండేవాడని చెప్పుకొచ్చాడు. కోపంలో ఉంటే తాను ఎవరినైనా చంపడానికి వెనుకాడని చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగానే ఓ రోజు తనని కూడా చంపాలని చూశాడని.. ఆ సమయంలో మా అమ్మ తనని పారిపొమ్మని చెప్పగా.. దాంతో వెంటనే కేవలం 500 రూపాయలు జేబులో పెట్టుకొని ముంబై ట్రైన్ ఎక్కేసినట్లు చెప్పాడు.

- Advertisement -

అయితే ఆరోజు మా నాన్న ఎందుకు కోపపడ్డారోన్నదానికి కూడా కారణం లేకపోలేదన్నారు. ‘మా నాన్నగారు ఒక గుడి పూజారి. ఆయనలాగే తన కొడుకును కూడా గుడిలో పూజారి కావాలని భావించారు. పూజారి ఒకవేళ కాకపోతే.. ప్రభుత్వ ఉద్యోగినైన లేక వ్యవసాయం చేయడం లాంటి పనులు చేయాలని ఆశ పడ్డాడు. కాకపోతే, నటుడు అవుతానని అసలు ఊహించలేదు. ఓ సమయంలో నేను సీత గెటప్ లో నటిస్తున్న సందర్భంలో మా నాన్న చూశాడు. ఆ తర్వాత బాగా కొట్టడు’ అని చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here