Karthikeya 3 Update : ఏంటి కార్తికేయ 3 ఆ.. అప్‍డేట్ ఇచ్చిన హీరో నిఖిల్

- Advertisement -

Karthikeya 3 Update : యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ – దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ, కార్తికేయ 2 సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. పౌరాణిక కథాంశాలతో కూడిన మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పల్లెటూరి మిస్టరీ కథాంశంతో 2014లో వచ్చిన కార్తికేయ ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక 2022లో వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీలోనూ భారీ కలెక్షన్లు రాబట్టింది. శ్రీకృష్ణుడి ఇతివృత్తంతో మిస్టరీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కిన కార్తికేయ 2 సూపర్‌ హిట్‌గా నిలిచింది. సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లో కార్తికేయ 3 సినిమా ఉంటుందని మూవీ టీం సంకేతాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత సినిమాకు సంబంధించి పెద్దగా అప్‌డేట్‌లు లేవు. దీంతో కార్తికేయ 3 కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.ఈరోజు (మార్చి 17) ఈ సినిమాపై హీరో నిఖిల్ ఓ అప్‌డేట్ ఇచ్చాడు. డాక్టర్ కార్తికేయ కొత్త సాహసం కోసం అన్వేషిస్తున్నారని నిఖిల్ ఈరోజు ట్వీట్ చేశాడు. అ

లాగే సినిమా స్టిల్స్ కు సంబంధించిన రెండో ఫొటోలను పోస్ట్ చేశారు. దర్శకుడు చందూ మొండేటిని ట్యాగ్ చేయడంతో పాటు, కార్తికేయ 3 హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ప్రస్తుతం చందు మొండేటి కార్తికేయ 3కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమాని మరింత గ్రాండ్ గా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సెకండ్ పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవ్వడంతో కార్తికేయ 3 భారీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. చందు మొండేటి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలను భారీగా పెంచేసింది. రాజుల కాలం నాటి కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గతేడాది ప్రారంభమైంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇక స్వయంభూ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here