Rashmika Mandanna : విజయ్​తో వెకేషన్​కు వెళ్లా.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నేషనల్ క్రష్



కిరిక్ పార్టీ సినిమాతో తెరంగేట్రం చేసిన Rashmika Mandanna ఆ తర్వాత తెలుగులో ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో బ్లాక్​ బస్టర్ హిట్స్ ఇస్తూ టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్​గా ఎదిగింది. ఈ బ్యూటీ సినిమాలతోనే కాదు తన క్యూట్ క్యూట్ మాటలతో.. ఎక్స్​ప్రెషన్స్​తో చాలా మంది ఫ్యాన్స్​ను సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ సౌత్ నుంచి వచ్చినా.. నార్త్​లోనూ సూపర్ క్రేజ్ దక్కించుకుంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

టాలీవుడ్​లో ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే.. రష్మిక బాలీవుడ్​పై ఫోకస్ చేసింది. అక్కడ ఫస్ట్ మూవీతోనే అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటులతో నటించే అవకాశం దక్కించుకుంది. గుడ్​ బై సినిమాతో హిందీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నుతో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రమోషన్స్​లోనే రష్మిక బిజీబిజీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా ఈ నేషనల్ క్రష్ ఓ ఛానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రష్మిక తన గురించి చాలా విషయాలు షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్, విజయ్ దేవరకొండతో రిలేషన్​షిప్ ఇలా చాలా విషయాలు మాట్లాడింది. మరి అవేంటో తెలుసుకుందామా..?

Rashmika mandanna vijay deverakonda

సినిమా రంగంలో విమర్శలు సహజమని రష్మిక అంటోంది. కాకపోతే అవి మితిమీరినప్పుడు మాత్రం తప్పక పెదవి విప్పాలంది. అందుకే ఈ మధ్యకాలంలో ట్రోల్స్‌పై ) స్పందిస్తున్నానని చెప్పింది. చిన్నప్పుడు స్కూల్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె పంచుకుంది.

‘‘ఎలాంటి సమస్యలు వచ్చినా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. అదెలా సాధ్యం?’ అని ఇటీవల చాలా మంది నన్ను అడిగారు. చిరునవ్వుతో జీవించడాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నాను. స్కూల్‌లో చదువుకునేటప్పుడు కుటుంబానికి దూరంగా హాస్టల్‌లో ఉండేదాన్ని. సుమారు 800 మంది విద్యార్థులు అక్కడ ఉండేవారు. ఎవరూ నాతో సరిగ్గా ఉండేవారు కాదు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తక్కువగా ఉండటంతో ఎన్నో అపార్థాలు తలెత్తాయి.

నేను చేయని తప్పులకు మాటలు పడేదాన్ని. ఆ సమయంలో ప్రతిరోజూ గదిలో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. అయితే, ఎలాంటి సమస్యలు వచ్చినా అమ్మతో పంచుకోవడం నాకు అలవాటు. ఆమే నన్ను ఇంత స్ట్రాంగ్‌గా చేసింది. ప్రపంచంలో ఎన్నో పెద్ద సమస్యలు ఉన్నాయని కాబట్టి దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందుకే మనసులో ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూనే ఉంటా’’ అని రష్మిక చెప్పుకొచ్చింది.

అనంతరం ఆమె ఇటీవల కిచ్చా సుదీప్‌ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకెంతో ఇష్టమైన ఓ నటుడు ఇచ్చిన ఇంటర్వ్యూని కొన్నిరోజుల క్రితం చూశాను. ఈ రంగంలో ఉన్నప్పుడు పూలదండలే కాదు. రాళ్లు, కోడిగుడ్లు విసిరినా తట్టుకోవాలని ఆయన అన్నారు. నేను దాన్ని అంగీకరిస్తాను. కాకపోతే, ఎదుటి వ్యక్తులు విసిరే రాళ్లు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు, ఆ దెబ్బలకు మీకు రక్తం చిందినప్పుడు ఎదురు తిరగక తప్పదు కదా’’ అని చెప్పింది.

Vijay Deverakonda Rashmika Mandanna
Vijay Deverakonda Rashmika Mandanna

విజయ్ దేవరకొండపై స్పందిస్తూ.. ‘‘విజయ్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌. ఇటీవల న్యూ ఇయర్‌ రోజు నేను లైవ్‌లో ఉన్నప్పుడు వెనుక విజయ్‌ వాయిస్‌ వినిపిస్తోందని కామెంట్స్‌ పెట్టారు. వాటిని చూసి మేము నవ్వుకున్నాం. ఎందుకంటే ఆ సమయంలో మరో నలుగురి వాయిస్‌లు కూడా వినిపించాయి . వాటిని ఎవరూ పట్టించుకోలేదు. మేమిద్దరం కలిసి టూర్స్‌కు వెళ్లలేదని, పార్టీలు చేసుకోలేదని ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఫ్రెండ్స్‌ అన్నాక కలిసి టూర్స్‌కు వెళ్లడం సహజం’’ అని అసలు సంగతి చెప్పుకొచ్చింది ఈ భామ.