Gopichand Malineni : శృతిహాస‌న్‌తో లవ్.. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ ఇదే..!



Gopichand Malineni సినిమా ఇండస్ట్రీలో పుకార్లు సాధారణం. సినిమా సెలబ్రిటీల గురించి వచ్చే రూమర్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇద్దరు వ్యక్తులు కలిసి కనిపిస్తే చాలు వాళ్ల మధ్య ఏదో నడుస్తుందంటూ పుకార్లు మొదలవుతాయి. ముఖ్యంగా హీరోయిన్ల గురించి రూమర్స్ మామూలుగా రావు. వాళ్లేం చేసినా ఎప్పుడూ ఓ కెమెరా వాళ్లను ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు తోటి నటులు చేసే పనుల వల్ల వారి మధ్య ఏం లేకపోయినా గాసిప్స్ పుడుతూ ఉంటాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్‌​కు అలాంటి పరిస్థితే ఎదురైంది.

శృతిహాస‌న్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యూటీ టాలీవుడ్​లోకి అడుగు పెట్టిన తర్వాత వరుస ఫ్లాప్​లతో సతమతమైంది. ఓ సమయంలో ఐరన్ లెగ్​ అనే పేరును కూడా మూటగట్టుకుంది. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో కలిసి నటించిన గబ్బర్ సింగ్​తో ఈ బ్యూటీ దశ తిరిగింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వినిపించడం మొదలైంది. ఎక్కడైతే ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుందో అక్కడే గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.

Gopichand Malineni
Shruti Hassan and Gopichand Malineni

ఇక శృతిహాస‌న్‌ .. ఒకే హీరోతో రెండు మూడు సినిమాలు చేసిన దాఖలు కూడా ఉన్నాయి. అంతే కాదు శృతిని చాలాసార్లు రిపీట్ చేసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా గోపీచంద్​ ఒకరు.శృతిహాస‌న్‌- గోపీచంద్ కాంబో అంటే బొమ్మ సూపర్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. వాళ్ల నమ్మకానికి తగ్గట్టు వీళ్ల సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉంటాయి.

హీరోయిన్​ శృతిహాస‌న్‌ ​- దర్శకుడు గోపిచంద్​ మలినేని కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు కలిసి బలుపు, క్రాక్​, వీరసింహారెడ్డి ఇలా మూడు హిట్లను అందుకున్నారు. పలు సందర్భాల్లోన్లూ శ్రుతి అంటే తనకు ఎంత అభిమానమో తెలిపారు గోపిచంద్​. అయితే ఇటీవలే వీరసింహా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ​ ఆయన.. శ్రుతికి ఐ లవ్​ యూ చెప్పిన సంగతి తెలిసిందే. దానికి ఆమె బదులిస్తూ ఐ లవ్ యూ అన్నయ్య అని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.

Gopichand Mmalineni
Gopichand Mmalineni

అయితే తాజాగా దీనిపై గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. “శృతిహాస‌న్‌ తో నాకు మూడో సినిమా. ఆమె అంటే చాలా ఇష్టం. మా కుటుంబంలోని అమ్మాయిలా చూస్తా. నా భార్యతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరిది అన్నా-చెల్లి బంధం. నేను ఓ అన్నయ్యగా ఐ లవ్​ యూ చెబితే.. సోషల్​మీడియాలో దానికి రివర్స్​ చేసి మసాలా యాడ్​ చేసి చూపించారు.” అని అన్నారు.

ఇక వీరసింహారెడ్డి విషయానికొస్తే.. ‘అఖండ’ తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో వచ్చిన నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమా ఇది. సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా సూపర్​ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే మంచి వసూళ్లను అందుకుంటూ బాక్సాఫీస్​ వద్ద అదరగొడుతోంది.

ముఖ్యంగా బాలయ్య యాక్టింగ్‌, యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. బాలయ్య సరసన శృతిహాస‌న్‌, మలయాళీ భామ హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించింది. దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టించారు. తమన్ సంగీతం అందించారు.