Ram Charan : గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కి తీవ్ర గాయాలు.. ఆందోళనలో ఫ్యాన్స్

ram charan shankar


Ram Charan : ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గేమ్ ఛేంజ‌ర్‌ షూటింగ్ వాయిదాప‌డింది. కాకపోతే.. రెండు రోజుల క్రితం జ‌రిగిన ప్రమాదంలో ఆయన ముఖానికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్లు రామ్‌చ‌ర‌ణ్‌ ను ప‌ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సమాచారం. ఈ సినిమా సెప్టెంబ‌ర్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ట్విటర్ ద్వారా ప్రకటించింది. దీంతో పాటు కొంద‌రు న‌టీన‌టులు అందుబాటులో లేక‌పోవ‌డంతో షూటింగ్‌ను వాయిదావేయాల్సి వ‌చ్చింద‌ని, అక్టోబ‌ర్ రెండో వారం నుంచి సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపింది.

Ram Charan
Ram Charan

అయితే షూటింగ్ వాయిదా ప‌డ‌టానికి అస‌లు కార‌ణం న‌టీన‌టులు అందుబాటులో లేక‌పోవ‌డం కాదు. ప్రమాదంలో రామ్ చ‌ర‌ణ్ గాయపడడమే అని స్పష్టం అవుతుంది. గాయం తీవ్ర‌త చిన్న‌దే అయినా ప‌ది రోజుల పాటు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ఆయన గాయం కార‌ణంగా ఆదివారం నుంచి మొద‌లుకావాల్సిన గేమ్‌ ఛేంజ‌ర్ కొత్త షెడ్యూల్‌ను పోస్ట్‌పోన్ అయింది.

game-changer-first-look

రామ్‌చ‌ర‌ణ్ పూర్తిగా కోలుకున్న త‌ర్వాత‌ ఆక్టోబ‌ర్ 6 నుంచి హైద‌రాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్‌ మొదలు కాబోతుంది. కేజీఎఫ్ ఫేమ్ అన్భు అరివు సార‌థ్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు శంకర్. పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను దాదాపు 200 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.