కూతురితో కలిసి ఆ పూజ చేసుకున్న ఉపాసన.. క్లీంకార‌ హైలైట్ అంటున్న ఫ్యాన్స్

- Advertisement -

మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. చిన్నారికి క్లీంకార అని పేరు పెట్టారు. ఇంటికి మ‌హాల‌క్ష్మీ వ‌చ్చింద‌ని మెగాస్టార్ చిరంజీవి ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. చిన్నారికి సంబంధించిన ఫోటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నా కూడా ఆమె ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

క్లీంకార‌
క్లీంకార‌

తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉపాస‌న ఓ ఫోటోను షేర్ చేసింది. కూతురితో క‌లిసి మొద‌టి సారి వ‌ర‌ల‌క్ష్మీ వ‌త్రాన్ని చేసుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అందుకు సంబంధించిన పిక్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. రెడ్ కలర్ డ్రెస్ లో ఉపాసన ట్రెడిషనల్ లుక్ లో ఉండగా .. వెనుక దేవుడి పటాలతో అలంకరణ అద్భుతంగా ఉంది.‘ఇంత‌కు మించి ఇంకా ఏమీ వ‌ద్దు. నా క్లీంకార‌తో క‌లిసి మొద‌టి సారి వ‌ర‌ల‌క్ష్మీ వ‌త్రాన్ని చేసుకున్నాను.’ అంటూ రాసుకొచ్చింది.

ఇక ఇందులో ఉపాస‌న ముఖంలో ఆనందాన్ని చూడొచ్చు. కాగా.. ఎప్ప‌టిలాగానే క్లీంకార ముఖాన్ని క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త తీసుకున్నారు. ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు.. క్లీంకార ఫేస్ చూపించమని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే.. త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ష‌న్ రామ్‌చ‌ర‌ణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here