Pushpa 2 : పుష్ప-2లో రామ్ చరణ్.. మరోసారి బన్నీ-చెర్రీల కాంబో

- Advertisement -

Pushpa 2 : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​ను ఐకాన్ స్టార్​గా మార్చిన సినిమా.. తెలుగు హీరో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్​ను తీసుకొచ్చిన మూవీ.. పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్​ యాక్టింగ్.. సుకుమార్ టేకింగ్.. రష్మిక గ్లామర్​.. మొత్తానికి సినిమా కంటెంట్.. యావత్ భారత ప్రేక్షకులను అలరించింది. భాషాబేధాల్లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఇండియాలోనే కాదు రష్యా వంటి విదేశాల్లోనూ ఈ మూవీ పాపులారిటీ అంతా ఇంతా కాదు.

Allu Arjun and Ram Charan In Pushpa 2
Allu Arjun and Ram Charan In Pushpa 2

పుష్ప క్రేజ్​ చూసి ఫిదా అయిన రష్యన్లు అక్కడ సినిమా విడుదల చేయాలని కోరగా.. ఇటీవలే రష్యాలో ప్రమోషన్స్​కు వెళ్లింది పుష్ప టీమ్. అక్కడి ఫ్యాన్స్​ను శ్రీవల్లి-పుష్పరాజ్​లు పలకరించారు. వారితో కలిసి సందడి చేశారు. ఇలా ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందని ఫస్ట్ పార్ట్​ రిలీజ్​కు ముందే చెప్పారు డైరెక్టర్ సుకుమార్. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. సెకండ్ పార్ట్ పుష్ప ది రూల్​ షూటింగ్​లో బిజీగా ఉంది ఈ టీమ్.

గతేడాది విడుదలైన మొదటి భాగం పుష్ప ది రైజ్​ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రెండో భాగం పుష్ప:ది రూల్‌ ప్రస్తుతం సిద్ధమవుతోంది. తొలి భాగానికి మంచి ఆదరణ లభించడంతో ఆ అంచనాలకు తగ్గకుండా సుకుమార్‌ రెండో భాగాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పుష్ప2కు మరింత క్రేజ్‌ తీసుకొచ్చే పనిలో ఉంది చిత్ర బృందం. దీనికోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు కథలో మార్పులు కూడా చేసినట్లు ఇప్పటికే విన్నాం. ఇప్పటికే సినిమా ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతోందని సినీ వర్గాల సమాచారం.

- Advertisement -

సినిమా కథ మాత్రమే కాదు.. టేకింగ్‌ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్లు మూవీ టీమ్​ చెబుతోంది. ఇకపోతే ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, మనోజ్ బాజ్‌పాయ్‌లు నటిస్తారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, అలాంటివేవీ లేవంటూ నిర్మాణ సంస్థ తెలిపింది. ఇక ఈ సినిమాలో నెగిటివ్​ రోల్​ కోసం మరో హీరోయిన్​ను దింపుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ హీరోయన్ ఎవరో కాదు ఇప్పటికే అల్లు అర్జున్​తో రెండు సార్లు రొమాన్స్ చేసిన ఎమ్మెల్యే అదేనండి కేథరిన్ థెరిసా. పుష్ప-2లో ఈ బ్యూటీ నెగిటివ్​ షేడ్​లో ఉన్న పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే క్లైమాక్స్‌ లీక్‌ అంటూ వినిపిస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పుష్ప ది రూల్‌ సినిమా క్లైమాక్స్​లో రామ్‌ చరణ్‌ను చూపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో ఈ విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఒకవేళ ఇది కనుక జరిగితే మాత్రం పుష్ప-2 సినిమా స్థాయి రేంజ్​ మాములుగా ఉండదు. ఇప్పటికే బన్నీ-చెర్రీలు కలిసి ఎవడు మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎంతటి హిట్ అయిందో చూసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ కాబోతుండటంతో పుష్ప ది రూల్ ఈ సారి ఇండియన్ సినిమా రికార్డ్స్​ని బద్ధలు కొట్టడం ఖాయమంటున్నారు సినీ వర్గాలు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here