Catherine Tresa : పుష్ప-2లో నెగిటివ్​ రోల్​లో ఆ హీరోయిన్​.. అల్లు అర్జున్​తో ముచ్చటగా మూడోసారి

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​ని ఐకాన్ స్టార్​గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్-బన్నీ కాంబినేషన్​లో వచ్చిన ఈ మూవీ టాలీవుడ్​తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒక్కసారిగా బన్నీ మేనియా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాను తాకి హోల్ ఇండియా విస్తరించింది. తెలుగు, మలయాళం, హిందీతో పాటు మిగిలిన భాషల్లో ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు మామూలుగా లేవు.

బన్నీ మాస్ గెటప్, యాస, పుష్ప క్యారెక్టర్​లో బన్నీ యాటిట్యూట్, నటన, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, డైలాగ్స్​ ఈ సినిమాను వేరే లెవల్​కు తీసుకెళ్లాయి. ఓవైపు నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్​గా.. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్​తో ఓ ఊపు ఊపేసింది. ఇక శ్రీవల్లిగా రష్మిక డీ గ్లామర్​ పాత్రలో నటించినా.. ఆమె పాత్రకున్న డైలాగ్స్ ఇప్పటికీ చాలా కార్యక్రమాల్లో వినిపిస్తూ ఉంటాయి. సామీ.. సామీ అంటూ శ్రీవల్లి ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది.

 

- Advertisement -
Catherine Tresa / పుష్ప-2
Catherine Tresa / పుష్ప-2

పుష్ప ది రైజ్​తో వచ్చిన క్రేజ్​తో ఈ మూవీ సీక్వెల్​ను ప్లాన్ చేశారు డైరెక్టర్ సుకుమార్. ‘పుష్ప ది రూల్​’తో సెకండ్ పార్ట్ తీస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా షురూ అయింది. అయితే పుష్ప రెండో పార్ట్​ ‘పుష్ప: ది రూల్​’లో మాత్రం సుకుమార్.. రష్మిక పాత్రను చాలా వరకు కట్ చేశారట. ఎందుకంటే పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ సిండికేట్ చూసుకోవడంలో భాగంగా అడవుల్లోనూ, కొన్ని ఆసియా దేశాల్లోనూ స్మగ్లింగ్ డీల్స్ మాట్లాడడానికి తిరిగే అవకాశాలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో పోలీసులు.. పుష్పరాజ్​ను పట్టుకోవడం కోసం శ్రీవల్లిని ఉపయోగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.శ్రీవల్లి పాత్రను చంపేసే అవకాశం కూడా ఉందని సమాచారం.

Pushpa-2 / పుష్ప-2
Pushpa-2 / పుష్ప-2

విలన్లు సునీల్, అనసూయ పాత్రలను మరింత పెంచుతారని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ కూడా లాక్ అయిందట. ఇక పుష్ప మూడో భాగం తీసే ఆలోచన సుకుమార్​కు లేదని.. కానీ రెండో పార్ట్​లో మాత్రం శ్రీవల్లి పాత్ర మృతితో ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉండబోతుందని తెలిసింది. ‘పుష్ప 2’ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సెకండ్ పార్ట్​లో మరో కీలక పాత్ర ఉంటుందని తెలుస్తోంది. హీరోయిన్ కేథరీన్ థెరీసా కూడా ఈ చిత్రంలో నటించబోతుందట.

పుష్ప 2లో ‘కేథరీన్ థెరీసా’ ది నెగిటివ్ పాత్ర అని తెలుస్తోంది. అలాగే ఈ సీక్వెల్​లో మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని, ఆ క్యారెక్టర్​లో ది ఫ్యామిలీ మ్యాన్ ఫేం మనోజ్ బాజ్​పేయ్ నటించబోతున్నారని సమాచారం. ‘పుష్ప సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పుష్పరాజ్ లాంటి పాత్రను స్టార్ హీరో చేసి మెప్పించడం చాలా రిస్క్. కానీ, బన్నీ ఆ రిస్క్ ను బాగా హ్యాండిల్ చేశాడు. ‘పుష్ప ది రూల్​’ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here