టాలీవుడ్ ముద్దుగుమ్మ పూర్ణ Poorna ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో పూర్ణ తన ఫ్యాన్స్‌కి బ్యూటీ ట్రీట్ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ చూస్తుంటే ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అనిపిస్తోందని పూర్ణ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఏ విషయంపై పోస్టు పెట్టిందో తెలుసా..?
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పూర్ణ తన డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. ‘ఒకరిని మెప్పించడానికి నేను బట్టలు ధరించను. స్టైల్ అండ్ కంఫర్ట్ మాత్రమే చూసుకుంటాను’ అని పూర్ణ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డిజైనర్ వేర్లో పూర్ణ సూపర్ గ్లామరస్‌గా ఉంది. ఈ బ్యూటీ అందానికి కుర్రాళ్లు మైస్మరైజ్ అవుతున్నారు.
ఈ మలయాళీ అందం పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. సరైన హిట్లు పడక ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. నెమ్మదిగా తెలుగు తెరపై పూర్ణ కనుమరుగైపోయింది.
పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడింజి. అందులో భాగంగా ’సిల్లీ ఫెలోస్’, ‘అఖండ’, ‘దృశ్యం 2’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పైనా సందడి చేస్తోంది. పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
పూర్ణ ఈ ఏడాది తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది. సోషల్ మీడియా వేదికగా అతనితో దిగిన ఫోటో షేర్ చేసింది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్తపేరు షానిద్ అసిఫ్ అలీతో పూర్ణ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. దుబాయ్‌లో జరిగిన ఈ వేడుకకు పూర్ణ ఫ్యామిలీ, బంధువులు మాత్రమే హాజరయ్యారు. కొన్ని కారణాల వల్ల అత్యంత సన్నిహితులు మాత్రమే తమ వివాహానికి హాజరయ్యారని పూర్ణ చెప్పింది.
పూర్ణకు భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు ఇచ్చాడట. పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని గిఫ్టుగా ఇచ్చాడట. దీని విలువ దాదాపుగా రూ. 1.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు దుబాయ్‌లో ఓ లగ్జరీ ఇల్లును కూడా ఆమెకు గిఫ్టుగా ఇచ్చాడని అంటున్నారు. దీని విలువ దాదాపు రూ. 25 కోట్లు వరకూ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా ఓ మంచి కారు, కొన్ని కంపెనీల షేర్స్ కూడా కానుకలుగా ఇచ్చాడట. వీటి విలువ 30 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.